MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • IPL ప్రారంభానికి ముందే కోహ్లీ సేనకు షాక్.. ఆర్సీబీ నుంచి స్టార్ ప్లేయర్లు ఔట్

IPL ప్రారంభానికి ముందే కోహ్లీ సేనకు షాక్.. ఆర్సీబీ నుంచి స్టార్ ప్లేయర్లు ఔట్

RCB vs SRH: ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. కీలక బౌలర్లు హెజిల్‌వుడ్, నువాన్ తుషారా దూరం కావడంతో రజత్ పాటిదార్ సేనలో టెన్షన్ మొదలైంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 27 2026, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిన్నస్వామి స్టేడియంలో హై టెన్షన్.. ఆర్‌సీబీ షాక్
Image Credit : Getty

చిన్నస్వామి స్టేడియంలో హై టెన్షన్.. ఆర్‌సీబీ షాక్

ఐపీఎల్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ధనాధన్ క్రికెట్ వినోదం షురూ కానుంది. అయితే, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే తలపడనున్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందే ఆర్‌సీబీకి షాక్ తగిలింది. కోహ్లీ టీమ్ బౌలింగ్ విభాగం ఇబ్బందుల్లో పడింది. జట్టులోని ఇద్దరు కీలక స్టార్ ఫాస్ట్ బౌలర్లు ఈ పోరుకు దూరం కావడంతో కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హెజిల్‌వుడ్ దూరం.. ఆర్‌సీబీకి పెద్ద దెబ్బ
Image Credit : Getty

హెజిల్‌వుడ్ దూరం.. ఆర్‌సీబీకి పెద్ద దెబ్బ

ఆర్‌సీబీ బౌలింగ్ అటాక్‌లో అత్యంత కీలకమైన అస్త్రం జోష్ హెజిల్‌వుడ్. ఈ ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ జట్టుతో చేరినప్పటికీ, తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశారు. హెజిల్‌వుడ్ దూరం కావడంతో జట్టు వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఎం. చిన్నస్వామి స్టేడియం వంటి బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై హెజిల్‌వుడ్ లేకపోవడం ఆర్‌సీబీకి పెద్ద లోటుగానే కనిపిస్తోంది. టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే అతను త్వరగా జట్టులోకి రావాలని యాజమాన్యం కోరుకుంటోంది.

36
నువాన్ తుషారా ఫిట్‌నెస్ సమస్యలు
Image Credit : Getty

నువాన్ తుషారా ఫిట్‌నెస్ సమస్యలు

హెజిల్‌వుడ్ అందుబాటులో లేని పక్షంలో శ్రీలంక పేసర్ నువాన్ తుషారాపై ఆర్‌సీబీ ఆశలు పెట్టుకుంది. కానీ, అక్కడా నిరాశే ఎదురైంది. తుషారా ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యాడు. అంతేకాకుండా, శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) నుంచి అతనికి ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించలేదు. దీనివల్ల అతను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. గతేడాది యష్ దయాల్ వంటి బౌలర్లు జట్టును వీడటంతో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్‌సీబీ బౌలింగ్ లైనప్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది.

46
రంగంలోకి జేక్ డఫీ, మంగేష్ యాదవ్?
Image Credit : Getty

రంగంలోకి జేక్ డఫీ, మంగేష్ యాదవ్?

స్టార్ బౌలర్లు దూరం కావడంతో కివీస్ పేసర్ జేక్ డఫీ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డఫీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతనితో పాటు మధ్యప్రదేశ్ యువ పేసర్ మంగేష్ యాదవ్ కూడా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

గత మినీ వేలంలో ఆర్‌సీబీ మంగేష్‌ను రూ. 5.20 కోట్లకు కొనుగోలు చేసింది. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ నాయకత్వంలో మంగేష్ అద్భుతంగా రాణించాడు. ఎడమచేతి వాటం పేసర్ కావడంతో ఇతను యష్ దయాల్‌కు సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

56
రజత్ పాటిదార్‌కు అగ్నిపరీక్ష
Image Credit : RCB\Instagram

రజత్ పాటిదార్‌కు అగ్నిపరీక్ష

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీకి సారథిగా రజత్ పాటిదార్‌కు ఇది మొదటి సవాల్. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో అనుభవం లేని ఆటగాళ్లతో సన్‌రైజర్స్ వంటి బలమైన జట్టును ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో ఆర్‌సీబీ బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది.

66
ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్ బిగ్ ఫైట్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనా
Image Credit : RCB\Instagram

ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్ బిగ్ ఫైట్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జేక్ డఫీ, మంగేష్ యాదవ్.

ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ.

ఇంపాక్ట్ ప్లేయర్: శివం మావి

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
IPL 2026 : కోహ్లీ, ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అదేంటో తెలుసా?
Recommended image2
IPL 2026: ఐపీఎల్ 2026 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది.. ముంబై vs చెన్నై ఫైట్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved