- Home
- Sports
- కేకేఆర్‌కు పతిరానా, చెన్నైకి మ్యాక్స్‌వెల్.. మినీ వేలంలోకి బిందాస్ ప్లేయర్స్.. టాప్ లిస్టు చూస్తే
కేకేఆర్‌కు పతిరానా, చెన్నైకి మ్యాక్స్‌వెల్.. మినీ వేలంలోకి బిందాస్ ప్లేయర్స్.. టాప్ లిస్టు చూస్తే
2026 IPL మినీ ఆక్షన్ కోసం పలువురు స్టార్ ఆటగాళ్లు విడుదలయ్యారు, గతంలో రిటైన్ అయిన ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. డేవిడ్ మిల్లర్, ఆండ్రీ రస్సెల్, రవి బిష్ణోయ్ వంటి కీలక ఆటగాళ్లు ఆక్షన్ బరిలోకి దిగుతున్నారు.

పలువురు స్టార్ ఆటగాళ్లు విడుదల
2026 IPL మినీ ఆక్షన్ కోసం పలువురు స్టార్ ఆటగాళ్లు విడుదలయ్యారు. మెగా ఆక్షన్ ముందే రిటైన్ అయిన ఆండ్రీ రస్సెల్, మతీస పతిరానా, రవి బిష్ణోయ్ వంటి కీలక ఆటగాళ్లు కూడా ఈసారి మళ్లీ మినీ ఆక్షన్ బరిలోకి దిగుతున్నారు. ఇది ఆక్షన్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది. అలాగే వీరితో పాటు మరికొందరు చిచ్చరపిడుగులు వస్తుండటంతో.. డిసెంబర్ 16న జరిగే మినీ వేలంపై అందరి దృష్టి పడింది.
రూ. 64.3 కోట్ల అత్యధిక పర్స్
ఇక విడుదలైన ఆటగాళ్ల పరిస్థితి అటుంచితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 64.3 కోట్ల అత్యధిక పర్స్ తో.. అలాగే ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ రూ. 43.4 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 25.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 22.9 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 21.8 కోట్లతో నెక్స్ట్ స్థానాల్లో అత్యధిక పర్స్ వాల్యూతో మినీ వేలం బరిలోకి దిగుతున్నాయి. ఇక అత్యల్పంగా ముంబై ఇండియన్స్ రూ. 2.75 కోట్లతో బరిలోకి దిగుతోంది. బహుశా ముంబై ఇంత తక్కువ పర్స్ తో వేలంలోకి రావడం ఇదే మొదటిసారి.
టాప్ 10 ప్లేయర్స్ వీరే
ఇక విడుదలైన టాప్ 10 ప్లేయర్స్‌లో ముందుగా డేవిడ్ మిల్లర్ అగ్రస్థానంలో నిలుస్తాడు. గతంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ బ్యాటర్‌కు.. ఐపీఎల్‌లో అపారమైన అనుభవం ఉంది. అలాగే 2025 సీజన్లో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతడు మిడిల్ ఆర్డర్ లో, ఫినిషింగ్ రోల్ లో అద్భుతంగా రాణించాడు.
ఫ్రాంచైజీల విజయాల్లో కీలక రోల్
అలాగే జాక్ ఫ్రేజర్, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, వనిందు హసరంగ, లియామ్ లివింగ్ స్టన్, మహీష్ తీక్షణ లాంటి ప్లేయర్స్ కూడా గతంలో తమ ఫ్రాంచైజీల విజయాల్లో కీలక రోల్ గా వ్యవహరించారు. ఇక గ్లెన్ మ్యాక్స్ వెల్ గురించి చెప్పాలంటే.. క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని ఆటగాడు. కొన్ని మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించినా.. స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేక సతమతమవుతున్నాడు.
రిలీజ్ లిస్టులో ఊహించని పేర్లు
ఇక మతీషా పతిరానా, ఆండ్రీ రస్సెల్.. ఈ రిలీజ్ లిస్టులో ఊహించని పేర్లు. వీరిద్దరూ మ్యాచ్ విన్నర్స్ అని చెప్పాలి. ఈ పది మందితో పాటు క్వింటన్ డికాక్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే వంటి ఇతర అద్భుతమైన ఆటగాళ్లు కూడా ఈ ఆక్షన్ లోకి వచ్చారు. ఇలాంటి తరుణంలో మినీ ఆక్షన్ ఆసక్తికరంగా మారనుంది. ఫ్రాంచైజీలు ఎవరిని ఎంపిక చేసుకుంటాయో వేచి చూడాలి.