ఈసారి మోత మోగాల్సిందే.. IPL మినీ వేలంలోకి బడా ప్లేయర్స్.. ఆ ఇద్దరిపైనే అందరి ఫోకస్
IPL 2026 రిటైన్, రిలీజ్ లిస్టులు బయటకు వచ్చేశాయి. ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసే దిశగా పలు కీలక ఆటగాళ్ళను విడుదల చేయడమే కాకుండా.. భవిష్యత్తు ప్రణాళికల ప్రకారం జట్టును తీర్చిదిద్దుతున్నాయి.

ఐపీఎల్ రిటైన్, రిలీజ్ లిస్టు విడుదల..
అన్ని జట్లు తమ రిటైన్, రిలీజ్ లిస్టులను విడుదల చేశాయి. ముఖ్యంగా ప్రతీ జట్టు తమ కోర్ టీంకు మరోసారి అవకాశాన్ని ఇచ్చాయి. మ్యాచ్ విన్నర్లను వదులుకోకుండా.. కోట్లు ఖర్చుపెట్టి.. ప్రభావం చూపని ఆటగాళ్ళను విడుదల చేశాయి. అందులో మినీ వేలంలోకి పలు సంచలన ఆటగాళ్లు వచ్చేశారు.
అత్యధిక, అత్యల్ప పర్స్‌లు వీరివే..
ఐపీఎల్ చరిత్రలో దాదాపుగా పలు జట్లు ఇప్పటికీ భారీగా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందులో ముందు వరుసలో ముంబై ఇండియన్స్ ఉంటుంది. ఈ జట్టులోని ప్లేయర్స్ హార్డ్ హిట్టర్స్ మాత్రమే కాదు.. మ్యాచ్ విన్నర్స్ కూడా. అందుకే మినీ వేలంలోకి ముంబై ఇండియన్స్ రూ. 2.75 కోట్లతో అత్యల్ప పర్స్‌తో కేకేఆర్ దాదాపుగా రూ. 63 కోట్లతో అత్యధిక పర్స్‌తో వేలంలోకి అడుగుపెట్టబోతున్నాయి.
మినీ వేలంలోకి మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, మిల్లర్..
రిలీజ్ ప్లేయర్స్ లిస్టులో పలు సంచలన ఆటగాళ్లు ఉన్నారు. వారి ఫామ్ లేమి, నిలకడలేమి, గాయాల బెడద, హెవీ పర్స్ కారణంగా ఫ్రాంచైజీలు ఆయా ఆటగాళ్లను విడుదల చేశాయి. ఈ లిస్టులో మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, మిల్లర్, హసరంగా, జంపా, రస్సెల్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు.
కేకేఆర్ జట్టు ప్రక్షాళన..
2024లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది కేకేఆర్ జట్టు. అయితే ఆ తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు.. మెగా వేలంలోకి వదిలేసిన పలువురు ఆటగాళ్ల వల్ల ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు సరికొత్తగా పేలవ ఆటగాళ్లను విడుదల చేసి.. మంచి టీంను మళ్లీ రూపొందించాలని అనుకుంటోంది.
ఆ ఇద్దరి కోసమే పోటీ..
కామెరాన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్ కోసం పలువురు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ ఇప్పుడు ప్రైమ్ ఫాంలో ఉండటం.. అలాగే మిడిలార్డర్ బ్యాటర్లుగా, ఫినిషర్లుగా మంచి ఇన్నింగ్స్ ఆడటంతో.. వీరిద్దరికీ పోటీ ఉండనుందని తెలుస్తోంది.