ఐపీఎల్ 2026: బిగ్ స్టార్లకు షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. రిటెన్షన్ లిస్టు ఇదే
IPL 2026 DC Retained and Released Players : ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫాఫ్ డూ ప్లెసిస్, జేక్ ఫ్రేసర్-మెక్‌గర్క్ సహా ఏడుగురు స్టార్లను చేసింది. అక్షర్ నేతృత్వంలో 17 మంది ప్లేయర్లను రీటైన్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌లో భారీ మార్పులు
ఐపీఎల్ 2026 మినీ వేలం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చాలా సమీక్ష చేసి కీలక నిర్ణయాలను ప్రకటించింది. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో మంచి ఆరంభం చేసినప్పటికీ, మధ్యలో జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. దీంతో జట్టులో ఈ సారి భారీ మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో, జట్టు మొత్తం ఏడుగురు ఆటగాళ్లను రీలీస్ చేస్తూ, కొత్త ప్లేయర్ల కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఢిల్లీ జట్టు ప్రధానంగా ఇద్దరు బిగ్ హిట్టర్లు అయిన ఫాఫ్ డూ ప్లెసిస్, జేక్ ఫ్రేసర్-మెక్‌గర్క్‌ను జట్టులో నుండి తప్పించింది. వీరిద్దరి నుంచి గత సీజన్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన రాకపోవడం దీనికి కారణం.
ఢిల్లీ క్యాపిటల్స్ రీలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే
ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఆటగాళ్లలో అనుభవజ్ఞుడైన ఫాఫ్ డూ ప్లెసిస్, అద్భుత స్ట్రైక్ రేట్‌తో పేరుపొందిన ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేసర్-మెక్‌గర్క్ లు ఉన్నారు. అలాగే, మొహిత్ శర్మ, సెడికుల్లా అటల్, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే వంటి ఇతర ముఖ్య భారతీయ ఆటగాళ్లను కూడా జట్టు విడిచిపెట్టింది.
ఫెరెరాను ట్రేడ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌కు పంపి, ప్రతిగా నితీష్ రాణాను డిల్లీ జట్టు తీసుకుంది. మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేయడానికి నితీష్ రాణా చేరిక కీలకంగా భావిస్తున్నారు.
జట్టు నిలుపుకున్న ముఖ్య ఆటగాళ్లు ఎవరు?
ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి 17 మంది ఆటగాళ్లను రీటైన్ చేస్తూ, అనుభవం, యువ శక్తి కలయికగా జట్టును తీర్చిదిద్దింది. అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా కొనసాగించనుంది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ట్రిస్టిన్ స్టబ్స్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో కొనసాగనున్నారు.
రీటైన్ చేసిన పూర్తి జాబితాలో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్, సమీర్ రిజ్వీ, అజయ్ మండల్, విప్రాజ్ నిగమ్, మాధవ్ తివారి వంటి యువ క్రికెటర్లు కూడా ఉన్నారు.
జట్టు స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించగా, పేస్ విభాగంలో మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా వంటి బౌలర్లను రీటైన్ చేశారు.
ఢిల్లీ క్యాపిటల్స్ వేలం పర్స్, ట్రేడ్ వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ మినీ వేలం రూ. 21.8 కోట్లు పర్స్ కలిగి ఉంది. మొత్తం 17 స్లాట్లు ఖాళీగా ఉండగా, అందులో అయిదు విదేశీ స్లాట్లు ఉన్నాయి. ఈ పెద్ద పర్స్‌ను వినియోగించి, జట్టు అవసరమైన ప్రాంతాలను బలోపేతం చేసేందుకు ఫ్రాంచైజీ ప్రయత్నిస్తుంది.
ట్రేడ్ విండోలో జరిగిన ముఖ్య మార్పు నితీష్ రాణా చేరిక. ఆయనను రూ. 4.2 కోట్ల ప్రస్తుత ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీ తీసుకుంది. మిడిల్ ఆర్డర్ లో స్థిరమైన బ్యాటింగ్ కోసం ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకుంది.
ఐపీఎల్ 2026 లక్ష్యాలు, మేనేజ్‌మెంట్ ఏం చెప్పింది?
ఐపీఎల్ 2026 లక్ష్యాలు, మేనేజ్‌మెంట్ ఏం చెప్పింది?
ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సీజన్‌కు ముందు ముఖ్య నిర్ణయాలను ప్రకటిస్తూ, జట్టు పనితీరును మెరుగుపరచడానికి ఈ మార్పులు కీలకమని స్పష్టం చేసింది. కోఓనర్ కిరణ్ కుమార్, పార్థ్ జిందల్ ఇద్దరూ జట్టు పోటీతత్వాన్ని పెంచడానికి అవసరమైన మార్పులను చేపట్టినట్టు తెలిపారు.
హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ ప్రకారం, గత సీజన్‌లో కొన్ని ఉత్కంఠభరిత క్షణాలు ఉన్నప్పటికీ, చివర్లో జట్టు తడబాటును సరిచేయడానికి ఈ వేలంలో కచ్చితమైన మార్పులు చేపట్టనున్నారని పేర్కొన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్, ఐపీఎల్‌లో పాల్గొంటున్న డిల్లీ క్యాపిటల్స్, 2026లో తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.