IPL : ఈ ఐపిఎల్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిందెవరు..? టాప్ 5 బౌలర్లు వీళ్లే
ఈ ఐపిఎల్ 2026 లో అత్యధిక పరుగులు చేసిందెవరో మీకు తెలిసుంటుంది..? అత్యధిక వికెట్లు తీసిందెవరో కూడా తెలిసుంటుంది..? మరి అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ ఎవరో తెలుసా…? టాప్ 5 లిస్ట్ ఇదే..

ఈ ఐపిఎల్ లో అత్యధిక డాాట్ బాల్స్ వేసిన టాప్ 5 బౌలర్లు..
IPL 2026 : టీ20 క్రికెట్ అంటేనే ధనాధన్ క్రికెట్... అందులోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మరీ దూకుడు క్రికెట్ కు పెట్టింది పేరు. అయితే ఈ ఐపిఎల్ సీజన్ లో పరుగులు సునామీ మరింత పెరిగింది... అధిక మ్యాచుల్లో 200+ స్కోరు నమోదవుతోంది. ఇలా బ్యాటింగ్ ఆధిపత్యం కలిగిన ఐపిఎల్ లో డాట్ బాల్ వేయడం అంటే మామూలువిషయం కాదు. ఇలా భారీ షాట్లు కాదు కనీసం సింగిల్ కూడా ఇవ్వకుండా బ్యాటర్లను నిలువరించి అత్యధిక డాట్స్ బాల్స్ వేసిన ఆటగాళ్ళ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. మహ్మద్ షమీ
ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ వేసింది మన ఇండియన్ బౌలర్ మహ్మద్ షమీనే. ఇతడు లక్నో సూపర్ జెయింట్స్ తరపున 7 మ్యాచులాడి ఏకంగా 81 డాట్ బాల్స్ వేశాడు. ఇలా షమీ ఇప్పటివరకు 27 ఓవర్లు వేశాడు... ఇందులో దాదాపు 13-14 ఓవర్లు డాట్ బాల్స్ వేసినట్లే. షమీ ఖాతాల్లో 7 వికెట్లు ఉన్నాయి.
2. జోప్రా ఆర్చర్
ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ వేసిన ఆటగాళ్లలో జోప్రా ఆర్చర్ రెండో స్థానంలో ఉన్నడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఇతడు ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 25 ఓవర్లు వేశాడు... ఇందులో 75 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే దాదాపు 12 ఓవర్లు పరుగులేమీ ఇవ్వలేదన్నమాట. అత్యధిక వికెట్లు తీసినవారిలోనూ ఆర్చర్ టాప్ 5 లో నిలిచాడు... ఇతడు ఇప్పటివరకు 11 వికెట్లు పడగొట్టాడు.
3. ప్రిన్స్ యాదవ్
ఈ ఐపిఎల్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ టాప్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచులాడిన ప్రిన్స్ 26 ఓవర్లు వేశాడు... ఇందులో 67 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే 11 ఓవర్లు పరుగులేమీ ఇవ్వలేదన్నమాట.
ఇక ఈ ఐపిఎల్ లో ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ టాప్ లో ఉన్నాడు. అతడు 13 వికెట్లు తీశాడు... 218 పరుగులు ఇచ్చాడు.
4. నంద్రె బర్గర్
రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ నంద్రె బర్గర్ కూడా ఈ ఐపిఎల్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేయడంలో అతడు ముందున్నాడు...7 మ్యాచుల్లో 22 ఓవర్లు వేసిన ఇతడు ఏకంగా 65 డాట్ బాల్స్ వేశాడు. అంటే 11 ఓవర్లు డాట్ బాల్స్ వేసినట్లు. ఇతడి ఖాతాలో 8 వికెట్లు ఉన్నాయి.
5. మహ్మద్ సిరాజ్
గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు 63 డాట్ బాల్స్ వేశాడు. అతడు ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడాడు.. అందులో 22 ఓవర్లు వేశాడు. ఇందులో 63 డాట్ బాల్స్ అంటే 10 ఓవర్లు పరుగులు ఇవ్వనట్లే. మొత్తంగా సిరాజ్ అకౌంట్లో 6 వికెట్లు ఉన్నాయి.

