MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: చెపాక్‌లో సన్‌రైజర్స్ ఊచకోత.. సీఎస్‌కేపై విక్టరీతో ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్, గుజరాత్

IPL 2026: చెపాక్‌లో సన్‌రైజర్స్ ఊచకోత.. సీఎస్‌కేపై విక్టరీతో ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్, గుజరాత్

SRH vs CSK Highlights: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. చెన్నైపై 5 వికెట్ల తేడాతో గెలిచి ఎస్‌ఆర్‌హెచ్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆర్సీబీ కూడా ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరుకుంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2026, 06:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీఎస్‌కే గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కావ్యపాప టీమ్.. ఒకే దెబ్బకు రెండు ప్లేఆఫ్ బెర్తులు ఫిక్స్
Image Credit : ANI

సీఎస్‌కే గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కావ్యపాప టీమ్.. ఒకే దెబ్బకు రెండు ప్లేఆఫ్ బెర్తులు ఫిక్స్

చెన్నై కి బిగ్ షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ సూపర్ నాక్ తో హైదరాబాద్ టీమ్ ప్లేఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన 63వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్ లో ధోని ఆడతారని అందరూ అనుకున్నారు. కానీ, సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ జట్టుతో కలిసి స్టేడియానికి వచ్చినప్పటికీ, మోకాలి నొప్పి కారణంగా మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా లేడని స్పష్టం చేశాడు. దీంతో హోమ్ గ్రౌండ్‌లో థాలా బ్యాటింగ్ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశకు గురయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంజూ శాంసన్ మెరుపులు.. కమిన్స్ రివర్స్ అటాక్
Image Credit : ANI

సంజూ శాంసన్ మెరుపులు.. కమిన్స్ రివర్స్ అటాక్

ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్ సంజూ శాంసన్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే ఒక సిక్స్, రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ప్రఫుల్ హింగే ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న సంజూ ను (13 బంతుల్లో 27) ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ఉర్విల్ పటేల్ (13) రెండు సిక్సర్లు కొట్టినా సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. కార్తీక్ శర్మ 19 బంతుల్లో 32 పరుగులు చేసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కానీ కమిన్స్ అతడిని కూడా పెవిలియన్‌కు పంపాడు.

35
రుతురాజ్ నిరాశపరిచాడు.. బ్రెవిస్ పోరాటంతో భారీ స్కోరు
Image Credit : ANI

రుతురాజ్ నిరాశపరిచాడు.. బ్రెవిస్ పోరాటంతో భారీ స్కోరు

మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. క్రీజులో సెట్ అవ్వడానికి కష్టపడుతూ 21 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పాట్ కమిన్స్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవడం గమనార్హం. ఈ వికెట్‌తో కమిన్స్ టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే జట్టును ఆదుకున్నారు. బ్రెవిస్ 27 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 44 పరుగులు చేయగా, దూబే 26 రన్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టగా, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే చెరో రెండు వికెట్లు తీశారు.

45
ఇషాన్ కిషన్ ఊచకోత.. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్
Image Credit : ANI

ఇషాన్ కిషన్ ఊచకోత.. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్

181 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ (26) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ట్రావిస్ హెడ్ (6) త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్ కూడా చెలరేగిపోయాడు.

క్లాసెన్ కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పేశాడు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్మరణ్ రవిచంద్రన్ ఫోర్ కొట్టి 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి 2 వికెట్లు తీశాడు.

55
సంజూ, క్లాసెన్ మధ్య గొడవ.. ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే
Image Credit : Getty

సంజూ, క్లాసెన్ మధ్య గొడవ.. ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే

హైదరాబాద్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. క్లాసెన్‌ను సంజూ సామ్సన్ స్టంపింగ్ చేసాడు. అవుట్ చేసిన తర్వాత సంజూ సెలబ్రేషన్స్ చేసుకున్న విధానం క్లాసెన్‌కు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య మైదానంలోనే కాసేపు వాగ్వాదం జరిగింది. ఇక ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచుల్లో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.

ఎస్‌ఆర్‌హెచ్ గెలవడంతో గుజరాత్ టైటాన్స్ కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఆర్‌సీబీ ఇప్పటికే టాప్-4 లో ఉంది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క ప్లేఆఫ్ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రేసులో ఉన్నాయి. చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే తమ తదుపరి మ్యాచ్ గెలవడంతో పాటు మిగతా జట్ల రన్ రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL హిస్టరీలో ఎక్కువ సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలిచిన టాప్ 5 ప్లేయర్స్ వీరే
Recommended image2
IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved