- Home
- Sports
- INDW vs ENGW : మన అబ్బాయిలు పరువుతీసిన నేలపైనే అమ్మాయిలు అదరగొట్టారుగా.. ఇంగ్లాండ్ పై ఇండియా విజయానికి టాప్ రీజన్స్ ఇవే
INDW vs ENGW : మన అబ్బాయిలు పరువుతీసిన నేలపైనే అమ్మాయిలు అదరగొట్టారుగా.. ఇంగ్లాండ్ పై ఇండియా విజయానికి టాప్ రీజన్స్ ఇవే
ఇంగ్లాండ్ గడ్డపై, అదీ చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా మహిళల క్రికెట్ టీం సూపర్ విక్టరీ సాధించింది. ఆతిథ్య జట్టును మట్టికరిపించి ఏకంగా 270 పరుగుల తేడాతో గెలిచింది.

అమ్మాయిల టీం అద్భుతమే చేసిందిగా..
England Women vs India Women : ప్రస్తుత భారత పురుషుల క్రికెట్ టీంతో పాటు మహిళల టీం కూడా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో తోపులం అని చెప్పుకునే ఇండియన్ మెన్స్ టీం విదేశీ గడ్డపై అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది... ఇప్పటికే రెండు టీ20 సీరీస్ లు కోల్పోయి దేశ పరువు తీసింది. ఇదే సమయంలో ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎదుగుతున్న భారత మహిళల జట్టు మాత్రం అద్భుతం చేసింది... ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది. యావత్ దేశం గర్వపడేలా చేసింది.
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ లో, అదీ అత్యంత ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో హర్మన్ సేన అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లో మన అమ్మాయిలు రాణించారు... దీంతో ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టును వారి స్వదేశంలోనే ఓడించడం అంటే మామూలు మాట కాదు... మరి ఈ గెలుపు కోసం భారత జట్టు అనుసరించిన వ్యూహాలేంటి? విజయం వెనకున్న ప్రధాన కారణాలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.
మన అమ్మాయిల సూపర్ బ్యాటింగ్
మొదటి ఇన్నింగ్స్ లో 285, రెండో ఇన్నింగ్స్ లో 341... అంటే మొత్తం 626 పరుగులు చేశారు టీమిండియా బ్యాటర్లు. ఈపరుగులే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయి. 626 పరుగులను చేధించడంలో ఎంతటి బలమైన జట్టుకైనా కష్టమే… ఆతిథ్య జట్టు కూడా ఈ టార్గెట్ ముందు చతికిలపడింది. ఇలా ప్రత్యర్థిని భయపెట్టే స్కోరు చేయడంతోనే టీమిండియా సగం గెలిచింది. ఇలా విధ్వంసకర బ్యాటింగ్ తో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సాధించినన్ని పరుగుల తేడాతో విజయం సాధించింది.
సెంచరీ, హాఫ్ సెంచరీలతో చెలరేగిన అమ్మాయిలు
ఇండియన్ ఉమెన్స్ టీం బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో ఈ టెస్ట్ సీరిస్ బైటపెట్టింది. ఒకరి తర్వాత ఒకరు క్రీజులోకి రావడం, పరుగులు బాదడం, స్కోర్ బోర్డుని ఉరకలెత్తించడం... రెండు ఇన్నింగ్సుల్లో ఇదే జరిగింది. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన అయితే ఆకాశమే హద్దుగా చెలరేగింది.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 83, సెకండ్ ఇన్నింగ్స్ లో 70 పరుగులతో శుభారంభం అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (58), దీప్తి శర్మ (57), రిచా ఘోష్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో యస్తికా భాటియా సెంచరీ (113) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గెలిచింది అనేకంటే యస్తికా గెలిపించింది అనవచ్చు… అంత అద్భుతంగా ఆడిందామె.
టీమిండియా బౌలర్ల విశ్వరూపమిది...
టీమిండియా బ్యాటర్లే కాదు బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు... ముఖ్యంగా క్రాంతి గౌడ్ 7 వికెట్లు (ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5, సెకండ్ ఇన్నింగ్స్ లో 2) ఇంగ్లాండ్ ఓటమిని శాసించాయి. అత్యధిక వికెట్లతో టీమిండియాను విజయతీరాలకు చేర్చిన క్రాంతి గౌడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.
ఇక షయాలి సత్గరే 4 (2+2), స్నేహ రానా 6 (2+4), దీప్తి శర్మ 3 (1+2) వికెట్లతో తమవంతు పాత్ర పోషించారు. ఇలా బంతితో కూడా అద్భుతాలు చేశారు కాబట్టే టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే తెలుగమ్మాయి శ్రీచరణి ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయకపోవడం తెలుగు అభిమానులను కాస్త నిరాశపర్చే విషయం.

