టీమిండియాను గంభీర్ ముంచేశాడు ! ఓటమికి కారణం ఇదే
India South Africa : టీమిండియా కోల్‌కతా టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్ లో ప్రభావం చూపకపోవడం, బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బ, గిల్ గాయం వంటి కారణాలు భారత్ ను దెబ్బకొట్టాయి.

కోల్‌కతాలో భారత జట్టుకు పరాభవం
ఇండియా vs సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో భారత్ కు షాకింగ్ ఫలితం ఎదురైంది. వైట్ బాల్ క్రికెట్‌ను పక్కన పెడితే, రెడ్ బాల్ ఫార్మాట్‌లో భారత జట్టు ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గత ఏడాది దేశీయ సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది భారత్.
తాజాగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా భారత జట్టును 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇది 15 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా భారత్‌ను తమ గడ్డకపై ఓడించి ప్రత్యేకత సాధించింది.
టెంబా బవుమా నాయకత్వంలోని ఈ జట్టు, కీలక సందర్భాల్లో మెరుగ్గా ఆడింది. బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బకొట్టడం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల విఫలం కావడం, కెప్టెన్ శుభ్ మన్ గిల్ గాయం వంటి కారణాలు భారత జట్టు పరాజయానికి దారి తీశాయి.
భారత్ ను ముంచిన బ్యాటింగ్ ఆర్డర్ లోపాలు
భారత జట్టులో అనుభవజ్ఞులు, ఫుల్‌టైమ్ స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులతో ప్రయోగాలు చేయడం జట్టును దెబ్బకొట్టింది. జట్టు మేనేజ్‌మెంట్ వాషింగ్టన్ సుందర్‌ను మూడు నంబర్‌కు పంపే నిర్ణయం తీసుకుంది. సుందర్ తనవంతు ప్రయత్నంతో పోరాడి తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు సాధించాడు. అయితే అతడి బ్యాటింగ్ కృషి జట్టును నిలబెట్టడానికి సరిపోలేదు. బౌలింగ్‌లో తనుకు వికెట్లు రావడం లేదు. ఈ నిర్ణయం బ్యాటింగ్ స్థిరత్వాన్ని దెబ్బతీసింది.
ఆరుగురు లెఫ్టీ బ్యాటర్ల ప్లాన్ బూమరాంగ్ అయింది
కోల్‌కతా పిచ్‌పై లెఫ్టీ బ్యాటర్లు పెద్దగా సక్సెస్ కాలేదని చరిత్ర చెబుతోంది. ఆ సంగతి తెలిసినా టీమిండియా ప్లేయింగ్ 11 లో ఆరు లెఫ్టీ బ్యాటర్లు ఉండడం ఆశ్చర్యకరమే. ఆఫ్ స్పిన్‌కు విపరీతంగా టర్న్ ఇస్తున్న పిచ్‌పై లెఫ్టీ బ్యాటర్లు తడబడడం సహజమైంది.
యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వంటి పేరున్న ఆటగాళ్లు కూడా స్పిన్‌ను ఎదుర్కోలేక త్వరగా పెవిలియన్ చేరారు. ఈ బ్యాటింగ్ పతనం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది.
శుభ్ మన్ గిల్ గాయం
జట్టులో రైట్ హ్యాండ్ బ్యాటర్ల కొరత మధ్య కెప్టెన్ శుభ్ మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లోనే గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటుగా మారింది. ఫలితంగా ఇండియా 9 బ్యాటర్లతోనే 124 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది. గిల్ లేకపోవడంతో పాటు లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరగడం భారత్ కు పెద్ద దెబ్బగా మారింది. దీని ఫలితంగా 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం చవిచూసింది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పడిపోయిన భారత్
ఈ మ్యాచ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలకమైనది. ఇదే సైకిల్‌లో ఇండియా ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్ సిరీస్‌ను 2–2తో డ్రా చేసింది. అనంతరం వెస్టిండీస్‌పై 2–0తో గెలిచింది. సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్‌తో 1–1 డ్రా తర్వాత ఈ సిరీస్‌ను ముగించింది.
కోల్‌కతా తొలి టెస్ట్‌లో రెండు జట్లు కూడా బ్యాటింగ్‌లో కష్టపడి, స్పిన్‌కు సహాయం అందించిన పిచ్‌పై మొత్తం 38 వికెట్లలో 22 వికెట్లు స్పిన్నర్లు తీశారు.
భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగుల లక్ష్యాన్ని చేజార్చుకోవడం టెస్ట్ చరిత్రలో అత్యంత నిరాశాజనక క్షణాల్లో ఒకటిగా నిలిచింది. తాజా WTC పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా రెండో స్థానానికి చేరగా, భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక
1. ఆస్ట్రేలియా – 36 పాయింట్లు
2. సౌతాఫ్రికా – 24 పాయింట్లు
3. శ్రీలంక – 16 పాయింట్లు
4. ఇండియా – 52 పాయింట్లు (8 మ్యాచ్‌లు)