MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • మరుగుజ్జు అంటే మటాష్ చేశాడు.. టెంబా బవూమా ఇచ్చిపడేశాడు అంతే !

మరుగుజ్జు అంటే మటాష్ చేశాడు.. టెంబా బవూమా ఇచ్చిపడేశాడు అంతే !

Temba Bavuma: కోల్‌కతా టెస్టులో టీమిండియా 93 పరుగులకే కుప్ప కూలింది. హార్మర్ 8 వికెట్లు, టెంబా బవూమా హాఫ్ సెంచరీతో దక్షిణాఫ్రికా ఉత్కంఠ పోరులో భారత్ పై విజయం సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 16 2025, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు బావూమా షాక్
Image Credit : Getty

ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు బావూమా షాక్

స్పిన్‌కు సహకరించిన పిచ్ మీద అజేయ హాఫ్ సెంచరీతో తనపై విమర్శలు చేసిన భారత ప్లేయర్లకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావూమా. కష్టాల్లో కూరుకుపోయిన సౌతాఫ్రికా జట్టును ఒంటరిగా ముందుగా లాగుతూ.. భారత బౌలర్లను చిత్తు చేస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మరుగుజ్జు అంటే మటాష్ చేసి చూపించాడు టెంబా బావూమా !

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత జట్టు ఊహించని రీతిలో కుప్పకూలింది. కేవలం 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితుల్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్‌కు సహకరించిన పిచ్‌పై భారత బ్యాటర్లు లైన్, లెంగ్త్ మీద కంట్రోల్ కోల్పోవడంతో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత 15 ఏళ్లలో భారత్ మైదానంలో సఫారీ జట్టుకు ఇది తొలి టెస్ట్ విజయం కావడం విశేషం.

ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడిన టీమిండియా, యశస్వి జైస్వాల్ డకౌట్ అయిన క్షణం నుండి మళ్లీ నిలబడలేకపోయింది. కేఎల్ రాహుల్ కూడా ఒకే పరుగు చేసి వెనుదిరగడంతో జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జురెల్ (13), రిషభ్ పంత్ (2) త్వరగా ఔటవగా, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కూడా ప్రభావం చూపలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హార్మర్ స్పిన్ గూగ్లీ: 8 వికెట్లతో భారత బ్యాటింగ్‌ను దెబ్బకొట్టాడు
Image Credit : Getty

హార్మర్ స్పిన్ గూగ్లీ: 8 వికెట్లతో భారత బ్యాటింగ్‌ను దెబ్బకొట్టాడు

సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ మొత్తం మ్యాచ్‌లో ఎనిమిది కీలక వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అతని స్పిన్ సవాలుకు భారత బ్యాటర్లు సమాధానం కనుగొనలేకపోయారు.

అతనికి తోడు మార్కో జెన్సెన్, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు తీసి భారత్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టారు. భారత తరఫున వాషింగ్టన్ సుందర్ (31), అక్షర్ పటేల్ (26), రవీంద్ర జడేజా (18) కొంతవరకు పోరాడినా, జట్టును గెలుపు దిశగా నడిపేంతగా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లలేదు.

Related Articles

Related image1
IND vs SA: కోల్‌కతా టెస్టులో టీమిండియా ఘోర ఓటమి
Related image2
టీమిండియాను గంభీర్ ముంచేశాడు ! ఓటమికి కారణం ఇదే
35
టెంబా బవూమా క్లాస్ ఇన్నింగ్స్
Image Credit : Getty

టెంబా బవూమా క్లాస్ ఇన్నింగ్స్

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా ఆచితూచి ఆడి 55 పరుగులతో అజేయంగా నిలిచిన తన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ఒక దశలో 75/6 వద్ద కష్టాల్లో ఉన్న తన జట్టును పదునైన డిఫెన్స్, స్థిరమైన ఆటతో ముందుకు నడిపాడు. అతని ఇన్నింగ్స్‌ వల్లే సౌతాఫ్రికా 153 పరుగులు చేసింది.

ఈ పిచ్‌లో బ్యాటింగ్ అసాధ్యం కాదని, సహనంతో ఆడితే అవకాశాలు ఉన్నాయని బవూమా నిరూపించాడు. అక్షర్ దూకుడుగా ఆడుతున్న సమయంలో అతని క్యాచ్‌ను మిడ్‌వికెట్ వద్ద పరిగెత్తుకుంటూ బవూమా అద్భుతంగా పట్టుకోవడం సౌతాఫ్రికా విజయంలో కీలకంగా మారింది.

45
బుమ్రా–బవూమా వివాదం: బాడీ షేమింగ్ కామెంట్స్‌పై విమర్శలు
Image Credit : ICC

బుమ్రా–బవూమా వివాదం: బాడీ షేమింగ్ కామెంట్స్‌పై విమర్శలు

మొదటి రోజు ఆటలో బుమ్రా డీఆర్‌ఎస్ చర్చ సందర్భంగా బవూమాను మరుగుజ్జు అంటూ కామెంట్ చేసిన ఘటన స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకిందికి రావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా బవూమాకు క్షమాపణలు చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుని హ్యాండ్‌షేక్ చేసుకోవడంతో వివాదం ముగిసినట్టే భావించారు అభిమానులు.

55
భారత్ ఓటమి తర్వాత బవూమా ఏమన్నారు?
Image Credit : Getty

భారత్ ఓటమి తర్వాత బవూమా ఏమన్నారు?

మ్యాచ్ అనంతరం మాట్లాడిన టెంబా బవూమా, ఈ విజయం తన కెప్టెన్సీ కంటే జట్టు సమిష్టి కృషి ఫలితమని అన్నాడు. “పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. మా బౌలర్లు వరుసగా మమ్మల్ని ఆటలోకి తీసుకొచ్చారు. ఉదయం బోష్‌తో చేసిన భాగస్వామ్యం మా గెలుపుకు పునాది” అని వ్యాఖ్యానించాడు.

రబడా లేకుండానే సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్ అద్భుత ప్రదర్శన సౌతాఫ్రికా బౌలింగ్ దళాన్ని మరింత బలంగా చేసిందని ప్రశంసించాడు. తన పై విమర్శలు, బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన వారికి తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. బావూమా పై పంత్, బుమ్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. క్రికెట్ సర్కిల్ లో కొత్త చర్చకు దారితీశాయి. అయితే, బావూమా ఈ విషయాలను ప్రస్తావించకుండానే కూల్ గా ఉంటూ తన ఆటతో భారత్ కు షాకిచ్చాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
IND vs SA: కోల్‌కతా టెస్టులో టీమిండియా ఘోర ఓటమి
Recommended image2
టీమిండియాను గంభీర్ ముంచేశాడు ! ఓటమికి కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved