అదరగొట్టిన రోకో.. సిడ్నీలో భారత్ ఘన విజయం
India vs Australia: సిడ్నీ వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో భారత్ కు విజయాన్ని అందించారు. తమ పై వస్తున్న విమర్శలకు ఈ జోడీ బ్యాట్ తోనే సమాధానమిచ్చింది.

సిడ్నీ గ్రౌండ్‌లో టీమిండియా విక్టరీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం (అక్టోబర్ 25) జరిగిన మూడో వన్డేలో టీమిండియా విక్టరీ కొట్టింది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చూపించింది. దీంతో కంగారు టీమ్ భారత్ పై ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్ స్వీప్ రికార్డును మరోసారి అందుకోలేకపోయింది. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది.
— BCCI (@BCCI) October 25, 2025
ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ జాగ్రత్తగా ఆరంభించారు. అయితే 61 పరుగుల వద్ద హెడ్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత భారత స్పిన్నర్లు ఆధిపత్యం చూపించారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రన్స్ రాకుండా అడ్డుకున్నారు. అక్షర్ పటేల్, మార్ష్‌ను 49 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. క్యారీ, రెన్షా త్వరగా వెనుదిరగడంతో 183/3 నుంచి 195/5కి పడిపోయింది.
హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 4 వికెట్లు తీశాడు. నాథన్ ఎలిస్, మిచెల్ స్టార్క్ సహా టెయిలెండర్లను ఔట్ చేస్తూ ఆస్ట్రేలియాను 46.3 ఓవర్లలో 236 పరుగులకు పరిమితం చేశాడు.
రోహిత్, శుభ్ మన్ గిల్ శుభారంభం
237 పరుగుల లక్ష్యంతో ఆరంగేట్రం చేసిన భారత్‌కు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో మిచెల్ స్టార్క్‌పై వరుస బౌండరీలు బాది రోహిత్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇరువురి మధ్య 69 పరుగుల భాగస్వామ్యం నమోదు అయ్యింది. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ లో గిల్ 24 పరుగుల వద్ద క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు.
విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రాగా ప్రేక్షకుల అద్భుతంగా వెల్ కమ్ చెప్పారు. ఈ సిరీస్‌లో రెండు డక్ అవుట్‌ల తర్వాత కోహ్లీ తన బ్యాట్ పవర్ చూపిస్తూ హాఫ్ సెంచరీ నాక్ ఆడాడు. భారత్ కు విజయం అందించి అజేయంగా నిలిచాడు.
A clinical bowling and fielding effort 👏
A magnificent partnership between 2️⃣ greats 🫡
📸 Moments to cherish from #TeamIndia's 9️⃣-wicket victory in Sydney!
Updates ▶ https://t.co/omEdJjQOBf#AUSvIND | #3rdODIpic.twitter.com/uK7BJJeAUT— BCCI (@BCCI) October 25, 2025
కోహ్లీ రికార్డుల మోత.. రోహిత్ సెంచరీ నాక్
కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో కుమార సంగక్కర రికార్డును దాటి, వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని ముందు ఇప్పుడు సచిన్ టెండుల్కర్ మాత్రమే ఉన్నాడు.
రోహిత్ శర్మ 125 బంతుల్లో 121* పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో తన 33వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇద్దరి మధ్య 168 పరుగుల అజేయ భాగస్వామ్యం భారత్ విజయంలో కీలకం అయ్యింది.
A clinical bowling and fielding effort 👏
A magnificent partnership between 2️⃣ greats 🫡
📸 Moments to cherish from #TeamIndia's 9️⃣-wicket victory in Sydney!
Updates ▶ https://t.co/omEdJjQOBf#AUSvIND | #3rdODIpic.twitter.com/uK7BJJeAUT— BCCI (@BCCI) October 25, 2025
కంగారులపై రోకో దెబ్బ
భారత్ 38 ఓవర్లలో 237/1తో లక్ష్యాన్ని చేరుకుంది. 9 వికెట్ల భారీ విజయం సాధించింది. రోహిత్ శర్మ 121* (125) పరుగులతో నాక్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. హర్షిత్ రాణా 4/42 వికెట్లతో తన కెరీర్ బెస్ట్ సాధించాడు.
2️⃣0️⃣2️⃣ runs 👏
2️⃣1️⃣ fours 👌
5️⃣ sixes 👍
A splendid century 💯
For his superb batting, Rohit Sharma is adjudged the Player of the Series! 🔝
Scorecard ▶ https://t.co/omEdJjRmqN#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45pic.twitter.com/Bq2hS8IHLS— BCCI (@BCCI) October 25, 2025
📸📸
A Ro𝙝𝙞𝙩 Sharma special in Sydney ⭐️
Updates ▶ https://t.co/omEdJjQOBf#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45pic.twitter.com/EA9cGdui7G— BCCI (@BCCI) October 25, 2025