లెజెండరీ ప్లేయర్ల క్లబ్ లోకి రోహిత్ శర్మ
Most ODI Catches For India : భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న టాప్-6 ఫీల్డర్ల జాబితాలో రోహిత్ శర్మ చేరాడు. 100 క్యాచ్‌లతో లెజెండరీ ప్లేయర్ల క్లబ్‌లో చేరాడు. బ్యాటింగ్ లో కూడా సిడ్నీ గ్రౌండ్ లో అదరగొట్టాడు.

రోహిత్ శర్మ మరో రికార్డు
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మరో ప్రత్యేక రికార్డు సాధించాడు. భారత క్రికెట్‌లో ఫీల్డింగ్‌లో అదరగొట్టిన లెజెండరీ ప్లేయర్ల జాబితాలో చేరాడు. వన్డేల్లో అవుట్‌ఫీల్డర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు తీసిన టాప్-6 ఆటగాళ్ల లిస్ట్‌లో చోటు సంపాదించాడు. రోహిత్‌తో పాటు సురేష్ రైనా, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీలు ఈ జాబితాలో ఉన్నారు.
రోహిత్ శర్మ 100 క్యాచ్‌లు
రోహిత్ శర్మ వన్డేల్లో భారత జట్టుకు అవుట్‌ఫీల్డర్‌గా 274 ఇన్నింగ్స్‌లలో 100* క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో అతను ఇప్పుడు టాప్-6లో 6వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో కూడా రోహిత్ రాణించాడు. వరుసగా రెండో హాప్ సెంచరీ నాక్ ఆడాడు.
Milestone unlocked 🔓
Rohit Sharma completes his 100th catch in ODIs 🙌#TeamIndia | @ImRo45pic.twitter.com/OORJncEFJI— BCCI (@BCCI) October 25, 2025
వన్డేల్లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న భారత ప్లేయర్లు
భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లలో
- 5వ స్థానం: సురేష్ రైనా - 223 ఇన్నింగ్స్‌ల్లో 102 క్యాచ్‌లు
- 4వ స్థానం: రాహుల్ ద్రావిడ్ - 337 ఇన్నింగ్స్‌ల్లో 124 క్యాచ్‌లు
- 3వ స్థానం: సచిన్ టెండూల్కర్ - 456 ఇన్నింగ్స్‌ల్లో 140 క్యాచ్‌లు
- 2వ స్థానం: మహమ్మద్ అజారుద్దీన్ - 332 ఇన్నింగ్స్‌ల్లో 156 క్యాచ్‌లు
టాప్ లో విరాట్ కోహ్లీ
భారత్ తరఫున అవుట్‌ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. 302 ఇన్నింగ్స్‌లలో 164 క్యాచ్‌లు అందుకుని ఈ జాబితాలో టాప్ లో నిలిచాడు. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీకి దగ్గరగా మరో ప్లేయర్ కనిపించడం లేదు.
A solid start for our openers as they bring up a 50-run partnership between them 🤝🤝
Live - https://t.co/nnAXESYYUk#TeamIndia#AUSvIND#3rdODIpic.twitter.com/R6Vi8E5Gmx— BCCI (@BCCI) October 25, 2025
రోహిత్ 100 క్యాచ్‌లు… హర్షిత్ రాణా అద్భుత స్పెల్
ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు కీలక క్యాచ్‌లు అందుకుని 100 క్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. మిచెల్ ఓవెన్, నాథన్ ఎలిస్ వికెట్లు పడటంలో కీలకంగా ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో యంగ్ పేసర్ హర్షిత్ రాణా 4/39 గణాంకాలతో మెరిశాడు. 8 వన్డేలలో 16 వికెట్లు తీసి, రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు.
Harshit Rana finishes things off in style.
Gets two wickets in an over as Australia are all out for 236 runs in 46.4 overs.
Scorecard - https://t.co/nnAXESYYUk#TeamIndia#AUSvIND#3rdODIpic.twitter.com/LtZ6WpCJc7— BCCI (@BCCI) October 25, 2025