IND vs WI : ముగ్గురు మొనగాళ్లు.. విండీస్ ను కుమ్మేశారు ! ఇదేం కొట్టుడు సామీ !
IND vs WI : వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. కేఎల్ రాహుల్, జురేల్ (125), రవీద్ర జడేజా (104*) లు సూపర్ సెంచరీలతో అదరగొట్టారు.

IND vs WI : కేఎల్ రాహుల్, జురేల్, జడేజా.. మూడు సెంచరీలతో వెస్టిండీస్ చిత్తు
అహ్మదాబాద్ టెస్టులో భారత్ బ్యాటింగ్ ఫైర్‌వర్క్స్ మొదలైంది.. ఒకరు ఔటైతే ఇంకొకరు క్రీజులో వచ్చి వెస్టిండీస్ బౌలింగ్ ను దంచికొడుతూ పరుగుల వరదపారించారు. మొదట కేఎల్ రాహుల్ 9 ఏళ్ల తర్వాత స్వదేశంలో సెంచరీ నాక్ తో విండీస్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ తన కెరీర్ తొలి టెస్టు సెంచరీతో అదరగొట్టాడు.
అంతటితో ఆగకుండా మరో భారత ప్లేయర్ల కూడా సెంచరీని సాధించాడు. రాహుల్, జురేల్ అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన సెంచరీ నాక్ తో వెస్టిండీస్ బౌలింగ్ ను దంచికొట్టాడు. ఈ ముగ్గురు మొనగాళ్ల అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ లతో టీమిండియా భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.
విండీస్‌పై సెంచరీ.. జడేజా మరో మాస్టర్ ఇన్నింగ్స్
అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన జడేజా తన టెస్ట్ కెరీర్‌లో 6వ సెంచరీని నమోదు చేశాడు.
వెస్టిండీస్‌పై ఇది ఆయన రెండో సెంచరీ కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో జడేజా 5 సిక్స్‌లు, 6 ఫోర్లు బాదాడు. ధృవ్ జురేల్‌తో కలిసి 5వ వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.
ధ్రువ్ జురేల్ తొలి టెస్ట్ సెంచరీతో మెరిశాడు
కేఎల్ రాహుల్ తర్వాత ధ్రువ్ జురేల్ కూడా విండీస్ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. 190 బంతుల్లో సెంచరీ సాధించిన జురేల్ తన టెస్ట్ కెరీర్‌లో మొదటి శతకం కొట్టాడు. ఇది ఆయన 6వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే. ఈ సెంచరీతో జురేల్ భారత్ తరఫున సెంచరీ చేసిన 12వ వికెట్‌కీపర్‌గా నిలిచాడు. జురేల్ ఇన్నింగ్స్‌లో 2 సిక్స్‌లు, 12 ఫోర్లు వచ్చాయి. మొత్తం 125 పరుగులు చేసి ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్ 9 ఏళ్ల నిరీక్షణ ముగిసింది !
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో మొదట సెంచరీ సాధించాడు. విదేశాల్లో సెంచరీల మోత మోగించే కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత భారత్ తో సెంచరీ సాధించాడు. 2016 తర్వాత తొలిసారి భారత గడ్డపై సెంచరీ నమోదు చేశాడు. అప్పుడు ఆయన ఇంగ్లాండ్‌పై చెన్నైలో సెంచరీ బాదాడు. దాదాపు 9 ఏళ్త తర్వాత ఇప్పుడు సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు బాదాడు. 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది ఆయన టెస్ట్ కెరీర్‌లో 11వ సెంచరీ. కేఎల్ రాహుల్ సాధించిన 11 సెంచరీలలో 9 విదేశీ పిచ్‌లపై సాధించడం విశేషం.
విండీస్ పై బలమైన ఆధిక్యంలో భారత్
ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 448/5 వద్ద నిలిచింది. కేఎల్ రాహుల్, జురేల్, జడేజా సెంచరీలతో 400 మార్కును దాటేసింది. ప్రస్తుతం జడేజా 104*, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కాగా, భారత బౌలర్లు రాణించడంతో విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 286 పరుగుల భారీ ఆధిక్యం వచ్చింది. రెండో రోజు భారత్ 327 పరుగులు సాధించి మూడు వికెట్లు కోల్పోయింది. గిల్ (50), రాహుల్ (100), జురేల్ (125), జడేజా (104) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.
మొత్తం మీద భారత్ మొదట బౌలర్లు షాక్ ఇవ్వంగా.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ అహ్మదాబాద్ టెస్ట్‌లో విండీస్ బౌలర్లను చితక్కొట్టారు. జడేజా, జురేల్, రాహుల్ సెంచరీలతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది.