MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs PAK: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన అభిషేక్ శర్మ.. దెబ్బకు యువరాజ్, క్రిస్ గేల్ రికార్డులు బ్రేక్

IND vs PAK: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన అభిషేక్ శర్మ.. దెబ్బకు యువరాజ్, క్రిస్ గేల్ రికార్డులు బ్రేక్

India Vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 రన్స్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ సిక్సర్ల రికార్డును సమం చేశాడు. క్రిస్ గేల్‌ను దాటేసి కొత్త చరిత్ర సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 03 2026, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆసియా గేమ్స్ 2026 ఫైనల్: పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. యువీ సిక్సర్ల రికార్డ్ ఖేల్ ఖతం
Image Credit : ANI

ఆసియా గేమ్స్ 2026 ఫైనల్: పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. యువీ సిక్సర్ల రికార్డ్ ఖేల్ ఖతం

జపాన్‌లోని ఐచి-నాగోయాలోని కొరోగి అథ్లెటిక్ పార్క్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజ్ పోరులో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన సిక్సర్ల సునామీతో స్టేడియాన్ని హోరెత్తించిన అభిషేక్, సరికొత్త చరిత్ర సృష్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
28 బంతుల్లో 61 రన్స్.. 7 భారీ సిక్సర్లు
Image Credit : X/BCCI

28 బంతుల్లో 61 రన్స్.. 7 భారీ సిక్సర్లు

ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్‌ను మొదలుపెట్టాడు. కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, మొత్తంగా 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 217.86గా నమోదైంది. రెండో ఓవర్లోనే సాద్ మసూద్ బౌలింగ్‌లో తొలి సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత పాక్ బౌలింగ్ లైన్ అప్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌‌లో ఉస్మాన్ ఖాన్ స్టంప్ చేయడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది.

36
యువరాజ్ సింగ్ ఆల్-టైమ్ రికార్డు సమం
Image Credit : X/BCCI

యువరాజ్ సింగ్ ఆల్-టైమ్ రికార్డు సమం

భారత్, పాకిస్థాన్ టీ20 పోరులో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా యువరాజ్ సింగ్ పేరిట ఉన్న పాత రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు. 2012లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 7 సిక్సర్లు కొట్టగా, ఇప్పుడు 2026 ఆసియా గేమ్స్ ఫైనల్లో అభిషేక్ సరిగ్గా 7 సిక్సర్లు బాదాడు. 2025 దుబాయ్ ఆసియా కప్‌లోనూ పాక్‌పై అభిషేక్ 5 సిక్సర్లు బాదడం విశేషం. దీంతో భారత్-పాక్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 14 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (11 సిక్సర్లు) రికార్డును దాటేశాడు.

46
క్రిస్ గేల్ రికార్డు ఖేల్ ఖతం.. 400 టీ20 సిక్సర్లు
Image Credit : Abhishek Sharma

క్రిస్ గేల్ రికార్డు ఖేల్ ఖతం.. 400 టీ20 సిక్సర్లు

ఈ మ్యాచ్‌లో తన నాల్గో సిక్సర్ బాదడం ద్వారా అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్‌లో 400 సిక్సర్ల మైలురాయిని దాటేశాడు. అత్యంత వేగంగా అంటే తక్కువ బంతుల్లో 400 టీ20 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. అభిషేక్ 3,513 బంతుల్లో ఈ ఘనత సాధించగా, క్రిస్ గేల్ 3,557 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (3,027 బంతులు) అగ్రస్థానంలో ఉన్నాడు.

56
పవర్ ప్లేలో టీమిండియా ఆల్‌టైమ్ రికార్డ్ స్కోరు
Image Credit : X/BCCI

పవర్ ప్లేలో టీమిండియా ఆల్‌టైమ్ రికార్డ్ స్కోరు

అభిషేక్ శర్మ చెలరేగడంతో భారత్ పవర్ ప్లే వ్యవధిలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్‌పై భారత్‌కు ఇది అత్యుత్తమ పవర్ ప్లే స్కోరు. అంతకుముందు 2025 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో నమోదైన 69/0 రన్స్ రికార్డును టీమిండియా తిరగరాసింది. వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసి ఔటవ్వగా, సంజూ శాంసన్ 2 పరుగులకే నిరాశపరిచాడు.

66
క్యాలెండర్ ఇయర్‌లో వందకు పైగా సిక్సర్లు
Image Credit : XBCCI

క్యాలెండర్ ఇయర్‌లో వందకు పైగా సిక్సర్లు

2026 క్యాలెండర్ ఇయర్‌లో అభిషేక్ శర్మ ఇప్పటికే 104 టీ20 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్ పరిధిలో వందకు పైగా సిక్సర్లు కొట్టడం అభిషేక్‌కు ఇది వరుసగా రెండోసారి. 2025లో అతను 108 సిక్సర్లు బాదగా, ఈ ఏడాది ఇప్పటివరకు 104 సిక్సర్లతో కొనసాగుతున్నాడు. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు మార్కును రీచ్ అయిన రికార్డుల్లో రస్సెల్ (589 బంతులు) తర్వాత అభిషేక్ శర్మ (651 బంతులు) రెండో స్థానంలో నిలిచాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
పాకిస్తాన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jasprit Bumrah Net Worth: ఐపీఎల్‌లో కోట్లు, గ్యారేజీలో మేబ్యాక్.. జస్ప్రీత్ బుమ్రా సంపాదన ఎంత?
Recommended image2
Asian Games: చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు.. 44 ఏళ్ల త‌ర్వాత
Recommended image3
IND vs PAK: భారత్ vs పాక్ ఫైనల్ వర్షంతో రద్దైతే గోల్డ్ మెడల్ అందుకునేది ఎవరు? ఈ రూల్స్ తెలుసా?
Related Stories
Recommended image1
Jasprit Bumrah Net Worth: ఐపీఎల్‌లో కోట్లు, గ్యారేజీలో మేబ్యాక్.. జస్ప్రీత్ బుమ్రా సంపాదన ఎంత?
Recommended image2
IRCTC Divya Dakshin Yatra: ఒకే టిక్కెట్ తో అరుణాచలం, రామేశ్వరం సహా 7 దివ్యక్షేత్రాల దర్శనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved