భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఎప్పుడు? పూర్తి షెడ్యూల్ ఇదే
India vs Australia T20 Series: భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:45కు మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. 1:15 గంటలకు టాస్ పడుతుంది.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ముగిసింది. భారత జట్టు 1-2 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు రెండు జట్లు టీ20 ఫార్మాట్‌లో తలపడనున్నాయి. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
టీ20 మ్యాచ్‌ల సమయాల్లో కూడా మార్పులు జరిగాయి. వన్‌డేల్లో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేవి. ఇప్పుడు టీ20 మ్యాచ్‌లలో సమయం పూర్తి భిన్నంగా ఉంటుంది.
భారత్-ఆస్ట్రేలియా 20 మ్యాచ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
టీ20 ఫార్మాట్ వేగవంతమైన ఆట. అభిమానులు కూడా మధ్యాహ్నం ప్రారంభమయ్యే మ్యాచ్‌లను మరింత ఆసక్తిగా అనుసరిస్తారు. టాస్ మధ్యాహ్నం 1:15 గంటలకు, మ్యాచ్ ప్రారంభం 1:45 గంటలకు అవుతుంది. ఈ సమయాన్ని బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా కలిసి నిర్ణయించాయి.
భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలు
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మొత్తం ఐదు మ్యాచ్‌లుగా ఉంటుంది. ఈ సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభమై నవంబర్ 8తో ముగుస్తుంది. మొదటి టీ20 అక్టోబర్ 29న ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరుగుతుంది. రెండో మ్యాచ్ అక్టోబర్ 31న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో (MCG) జరుగుతుంది.
మూడో మ్యాచ్ కోసం జట్లు నవంబర్ 2న హోబార్ట్ వెళ్లి బెలెరీవ్ ఓవల్‌లో తలపడతాయి. నాలుగో మ్యాచ్ నవంబర్ 6న గోల్డ్ కోస్ట్‌లో జరుగనుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ మ్యాచ్ నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని ప్రసిద్ధ ది గబ్బా స్టేడియంలో జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతాయి.
IND vs AUS T20 : టీమిండియా స్క్వాడ్ వివరాలు
ఈ సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వైస్ కెప్టెన్‌గా శుభ్ మన్ గిల్ ఉంటారు. జట్టులో చాలా మంది యంగ్ ప్లేయర్లకు చోటు దక్కింది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్ దాడికి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. బుమ్రా, అర్షదీప్, హర్షిత్ రాణా పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్
మొదటి T20I - అక్టోబర్ 29 - కాన్‌బెర్రా
రెండవ T20I - అక్టోబర్ 31 - మెల్‌బోర్న్
మూడవ T20I - నవంబర్ 2 – హోబర్ట్
నాల్గవ T20I - నవంబర్ 6 - గోల్డ్ కోస్ట్
ఐదవ T20I - నవంబర్ 8 – బ్రిస్బేన్