ఫుట్‌బాల్ కంటే ఎక్కువ దేశాల్లో పాపులారిటీ... అసలు ఈ లాన్ బౌల్స్ ఎలా ఆడతారు? రూల్స్ ఏంటి...
ఓ కొత్త ఆటను పరిచయం చేయడానికి ఓ ప్రత్యేకమైన సందర్భం అవసరం. రాజమౌళి తీసిన ‘సై’ సినిమా, రగ్బీకి ఇక్కడ పాపులారిటీ తెచ్చిపెడితే... ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కారణంగా లాన్ బౌల్స్ పేరుకి క్రేజ్ వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత మహిళా లాన్ బౌల్స్ టీమ్ ఏకంగా త్రీ టైమ్ కామన్వెల్త్ ఛాంపియన్ సౌతాఫ్రికాని ఓడించి స్వర్ణం గెలిచింది...
కామన్వెల్త్ గేమ్స్ వుమెన్స్ ఫోర్ లాన్ బౌల్స్ ఫైనల్‌లో మూడు సార్లు ఛాంపియన్ టీమ్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి... స్వర్ణం కైవసం చేసుకుంది... భారత్‌లో పెద్దగా ఎవ్వరికీ తెలియకపోయినా లాన్ బౌల్స్‌కి ఘనమైన చరిత్రే ఉంది...
Image credit: Getty
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన 1930 నుంచి ప్రతీ ఏడిషన్‌లోనూ లాన్ బౌల్స్ ఈవెంట్ భాగంగా ఉంది. 1966 ఎడిషన్‌లో మాత్రం కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్ భాగంగా లేదు. జమైకాలో లాన్ బౌల్స్ నిర్వహించడానికి సరైన వేదిక లేకపోవడంతో 1966 కామన్వెల్త్‌లో లాన్ బౌల్స్‌ని భాగం చేయలేదు...
Lawn Bowls
ఒక్క ఇంగ్లాండ్‌లోనే 2 వేలకు పైగా లాన్ బౌల్స్ క్లబ్స్ ఉన్నాయి. ఆ దేశంతో పాటు చాలా ప్రాశ్చాత్య దేశాల్లో ఫుట్ బాల్ కంటే ఎక్కువ మంది లాన్ బౌల్స్ ఆడతారు.
లాన్ బౌల్స్‌ని నాలుగు రకాలుగా ఆడతారు. సింగిల్స్, డబుల్స్, త్రిబుల్స్‌తో పాటు ఫోర్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. సింగిల్స్‌లో ఒకరు, డబుల్స్‌లో ఇద్దరు, త్రిబుల్స్‌లో ముగ్గురు, ఫోర్స్‌లో నలుగురు కలిసి పోటీపడతారు. భారత మహిళా జట్టు ఫోర్స్ విభాగంలోనే స్వర్ణం సాధించింది...
Image credit: PTI
లాన్ బౌల్స్‌ని ఓ పచ్చిక మైదానంలో ఆడతారు. అందుకే దీన్ని అవుట్‌డోర్ బౌల్స్ అని కూడా అంటారు. ఇది అచ్చు మనం ఆడే ‘గోఠీ’ల ఆట లాంటిదే. టార్గెట్‌వైపు బంతిని చేత్తో రోల్ చేయాల్సి ఉంటుంది... టార్గెట్‌ని ‘ది జాక్’ అని పిలుస్తారు.
ఈ జాక్ కనీసం 23 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో ప్లేయర్‌కి ‘ది జాక్’ని కొట్టడానికి నాలుగు అవకాశాలు ఉంటాయి. నాలుగు అవకాశాల్లో లక్ష్యాన్ని కొట్టాల్సి ఉంటుంది. గోఠీల మాదిరిగానే ఎవరి బంతి, లక్ష్యానికి దగ్గరగా ఉంటుందో వాళ్లు విజేతగా పాయింట్ సాధిస్తారు...
Image credit: PTI
ఇలా 18 ఎండ్స్ నుంచి మ్యాచ్ సాగుతుంది. చూడడానికి మెత్తగా ఉన్నా లాన్ బౌల్స్ దాదాపు 1.5 కేజీల బరువు ఉంటాయి. ఓ వైపు బరువుగా ఉండి, ప్లేయర్ పట్టుకోవడానికి అనువుగా కాస్త వంకరగా ఉంటుంది...