MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Test Team: కళ్లు తెరిచిన బీసీసీఐ.. టీమిండియా టెస్టుల కోసం మాస్టర్ ప్లాన్.!

Test Team: కళ్లు తెరిచిన బీసీసీఐ.. టీమిండియా టెస్టుల కోసం మాస్టర్ ప్లాన్.!

Test Team: గత రెండేళ్లుగా భారత టెస్ట్ జట్టు ఎదుర్కొంటున్న వరుస వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ ఒక భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాల తర్వాత వచ్చే శూన్యాన్ని భర్తీ చేసేందుకు.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 07 2026, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీసీసీఐ 'రెడ్ బాల్ రీసెట్' వ్యూహం ఇదే!
Image Credit : BCCI\Twitter

బీసీసీఐ 'రెడ్ బాల్ రీసెట్' వ్యూహం ఇదే!

భారత గడ్డపై దశాబ్ద కాలంగా కొనసాగిన టీమిండియా ఆధిపత్యానికి గత ఏడాది న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఎదురైన పరాజయాలు పెద్ద బ్రేక్ వేశాయి. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, టెస్ట్ క్రికెట్‌లో భారత్ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. దీనికి "రెడ్ బాల్ రీసెట్" అని పేరు పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యువ ప్రతిభకు పెద్దపీట:
Image Credit : BCCI\Twitter

యువ ప్రతిభకు పెద్దపీట:

కేవలం ఐపీఎల్ మెరుపులకే పరిమితం కాకుండా, టెస్ట్ క్రికెట్‌లో అవసరమైన ఓపిక, టెక్నిక్ ఉన్న యువ ఆటగాళ్లను వెలికితీయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే లాంటి యువ కిశోరాలను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. వీరికి అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందించి, భవిష్యత్తులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల స్థానాలను భర్తీ చేసేలా సిద్ధం చేస్తారు.

Related Articles

Related image1
Cricket: డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట‌ర్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం
Related image2
India Cricket Fearless Era : అప్పుడు విలన్లు.. ఇప్పుడు హీరోలు ! అసలు మాస్టర్ మైండ్ కథ ఇది !
35
ప్రత్యేక టోర్నమెంట్, ఎంపిక ప్రక్రియ:
Image Credit : BCCI\Twitter

ప్రత్యేక టోర్నమెంట్, ఎంపిక ప్రక్రియ:

ఈ వ్యూహంలో భాగంగా జూన్, జూలై నెలల్లో ఒక ప్రత్యేక టోర్నమెంట్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. ఇందులో 25 ఏళ్ల లోపు వయసున్న 64 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.

45
నాలుగు జట్లుగా విభజించి..
Image Credit : BCCI\Twitter

నాలుగు జట్లుగా విభజించి..

రంజీ ట్రోఫీ, కూచ్ బెహర్ ట్రోఫీ, సీకే నాయుడు ట్రోఫీలలో రాణించిన వారితో పాటు సమీర్ రిజ్వీ వంటి ఐపీఎల్ యువతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీరిని నాలుగు జట్లుగా విభజించి, విభిన్నమైన పిచ్‌లపై వారి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.

55
భవిష్యత్తు లక్ష్యం:
Image Credit : BCCI\Twitter

భవిష్యత్తు లక్ష్యం:

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ టోర్నీలో రాణించిన వారిని నేరుగా అండర్-19 ఎమర్జింగ్ జట్లకు ఎంపిక చేసి శ్రీలంక పర్యటనకు పంపనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా రాబోయే దశాబ్ద కాలం పాటు టెస్ట్ క్రికెట్‌లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించేలా పటిష్టమైన బెంచ్ బలాన్ని నిర్మించడమే బీసీసీఐ లక్ష్యం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Cricket: డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట‌ర్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం
Recommended image2
India Cricket Fearless Era : అప్పుడు విలన్లు.. ఇప్పుడు హీరోలు ! అసలు మాస్టర్ మైండ్ కథ ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved