60 నిమిషాల్లో 45 సిక్సర్లు.. వామ్మో.! కాటేరమ్మ కొడుకు విస్పోటనం మాములుగా లేదుగా..
Abhishek Sharma: అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ, న్యూజిలాండ్ సిరీస్‌ల కోసం జైపూర్‌లోని అనంతం క్రికెట్ గ్రౌండ్‌లో సాధన చేశాడు. 60 నిమిషాల్లో 45 సిక్సర్లు బాది తన ఎటాకింగ్ బ్యాటింగ్ శైలిని ప్రదర్శించాడు. స్పిన్నర్లకు..

యువ సంచలనం విధ్వంసం..
భారత క్రికెట్‌లో ప్రస్తుతం 'సిక్సర్ల కింగ్' అంటే యువ సంచలనం అభిషేక్ శర్మ పేరు గుర్తొస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్న అభిషేక్ శర్మ.. జైపూర్‌లోని ప్రాక్టీస్ సెషన్‌లో దుమ్ములేపాడు.
60 నిమిషాల్లో 45 సిక్సర్లు..
పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్.. అనంతం క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేవలం 60 నిమిషాల వ్యవధిలో ఏకంగా 45 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ నెట్స్‌లో డిఫెన్స్‌ను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఎటాకింగ్ బ్యాటింగ్ మీదే దృష్టి సారించాడు.
పిచ్ బౌలర్లకు అనుకూలం.. కానీ.!
జైపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తూ బంతి బాగా టర్న్ అవుతున్నప్పటికీ, అభిషేక్ ఏ మాత్రం తగ్గలేదు. బౌలర్లు బంతిని విసరడం ఆలస్యం, అది గాల్లోకి ఎగిరి బౌండరీ అవతల పడాల్సిందే అన్నంత వేగంగా బ్యాటింగ్ చేశాడు.
ఇన్సైడ్ అవుట్ షాట్లతో..
అభిషేక్ పదేపదే ఇన్సైడ్ అవుట్ షాట్లతో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్లు కొట్టడం చూసి పంజాబ్ హెడ్ కోచ్ సందీప్ శర్మ ఆశ్చర్యపోయాడు. "నువ్వు నీ సెంచరీని కేవలం ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్లు కొట్టి మాత్రమే పూర్తి చేయాలనుకుంటున్నావా?" అని కోచ్ సరదాగా వ్యాఖ్యానించాడు.
సిక్సర్ల వర్షం..
తప్పుడు షాట్లను నియంత్రించడానికి ఎక్స్‌ట్రా కవర్ వద్ద నెట్ ఏర్పాటు చేసినప్పటికీ, అభిషేక్ దానిని దాటించి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సెషన్ చూస్తుంటే అభిషేక్ ఏ స్థాయిలో సిద్ధమయ్యాడో స్పష్టమవుతోంది. కేవలం సింగిల్స్, డబుల్స్ తీయడం కాకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే తన ఆటగా మార్చుకున్నాడు.

