MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Abhishek Sharma : అయ్యా అభిషేకూ.. రోహిత్, సంజూల రికార్డులు బద్దలుగొట్టడం అవసరమా..!

Abhishek Sharma : అయ్యా అభిషేకూ.. రోహిత్, సంజూల రికార్డులు బద్దలుగొట్టడం అవసరమా..!

లక్నో సూపర్ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బాగా ఆడి సంజూ, రోహిత్ ల రికార్డులు బద్దలుగొడతాడనుకుంటే చెత్త ఆటతో ఆపని చేశాడు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 06 2026, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ భయ్యా... ఈ ఆటేందిరయ్యా..
Image Credit : Getty

అభిషేక్ భయ్యా... ఈ ఆటేందిరయ్యా..

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి తప్పలేదు. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఎస్‌ఆర్‌హెచ్‌ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో విఫలమయ్యింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపర్చాడు.. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. ఎల్ఎస్జి బౌలర్ మహమ్మద్ షమీ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ అయ్యాడు. వైడ్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చిన అభిషేక్ పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో డకౌట్ ద్వారా అభిషేక్ శర్మ ఖాతాలో మరో చెత్త రికార్డు చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో జరిగిన టీ20ల్లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అంటే ఖాతా తెరవకుండానే ఔటైన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ చేరాడు. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సంజూ శాంసన్ కూడా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిషేక్ చెత్త రికార్డు..
Image Credit : ANI

అభిషేక్ చెత్త రికార్డు..

ఈ ఏడాది జరిగిన టీ20 ఫార్మాట్ మ్యాచుల్లో అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం ఇది ఆరోసారి. దీంతో ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, సంజూ శాంసన్ రికార్డును సమం చేశాడు. 2018లో రోహిత్ ఆరుసార్లు, 2024 లో సంజూ శాంసన్ ఆరుసార్లు డకౌట్ అయ్యారు.. తాజా డకౌట్ తో అభిషేక్ ఖాతాలో కూడా ఆరు సున్నా రన్ ఇన్నింగ్స్ లు చేరాయి. బాగా ఆడి అద్భుతమైన రికార్డులు సాధిస్తాడనుకుంటే ఇలా చెత్త ఆటతీరుతో రికార్డులు నెలకొల్పడం ఏంటని సన్ రైజర్స్ అభిమానులు అభిషేక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఇలా గతంలో అతడిని పొగిడినవారే ఇప్పుడు విమర్శిస్తున్నారు.

35
టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ డకౌట్స్ రికార్డ్..
Image Credit : ANI

టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ డకౌట్స్ రికార్డ్..

ఈ ఐపీఎల్‌కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ అభిషేక్ వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడని భావించినా, ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే మళ్లీ విఫలమయ్యాడు. వరల్డ్ కప్ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడనుకున్న అభిషేక్, 8 ఇన్నింగ్స్‌లలో కేవలం 141 పరుగులే చేశాడు.

45
ఐపిఎల్ లోనూ మారని అభిషేక్ ఆటతీరు..
Image Credit : ANI

ఐపిఎల్ లోనూ మారని అభిషేక్ ఆటతీరు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం అభిషేక్ శర్మ మెరిశాడు. 21 బంతుల్లో 48 పరుగులు చేసి అదరగొట్టాడు. కానీ ఆ తర్వాతి మ్యాచ్‌లోనే మళ్లీ డకౌట్ అయ్యాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో అభిషేక్ కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 48 పరుగులు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చేసినవే కావడం గమనార్హం. అభిషేక్ శర్మకు 195 స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ, ఈ ఏడాది ఆడిన 16 ఇన్నింగ్స్‌లలో 25.20 సగటుతో కేవలం 378 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

55
లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం..
Image Credit : ANI

లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం..

హైదరాబాద్‌ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లోకల్ టీం సన్ రైజర్స్ కేవలం 156/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 50 బంతుల్లో 68* పరుగులు చేసిన కెప్టెన్ రిషభ్ పంత్ లక్నో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image3
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Related Stories
Recommended image1
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Recommended image2
IPL 2026 : సన్‌రైజర్స్ సిక్సర్ల కింగ్.. అభిషేక్ శర్మ షేక్ చేస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved