స్పెయిన్ తో ఉత్కంఠ పోరు.. పారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన భారత హాకీ జట్టు
భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ 2024 లో బ్రాంజ్ మెడల్ గెలుచుుకంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో స్పెయిన్ ను భారత్ 2-1 తో చిత్తు చేసింది.
Hockey, Indian hockey team, Team India at Paris Olympics
India vs Spain Hockey Bronze Fina: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత జట్టు బ్రాంజ్ మెడల్ మ్యాచల్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. స్పెయిన్ ను చిత్తుగా ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది.
1928లో ఆమ్‌స్టర్‌డామ్ క్రీడల్లో భారత హాకీ జట్టు తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. ఐదు మ్యాచ్‌లలో 29 గోల్స్ చేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. భారత హాకీ మాత్రికుడు మాంత్రికుడు ధ్యాన్ చంద్ నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్‌లో హ్యాట్రిక్ సహా 14 గోల్స్ చేశాడు.
భారత హాకీ జట్టు హాకీ జట్టు టోక్యో 2020 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో కూడా బ్రాంజ్ మెడల్ ను గెలుచుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చక్కటి బ్రేస్‌పై రైడింగ్ భారత్ కు మెడల్ ను అందించింది.
Indian Hockey Team
బ్రాంజ్ మెడల్ పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ (30వ, 33వ నిమిషంలో) గోల్ చేయగా, స్పెయిన్‌కు 18వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో కెప్టెన్ మార్క్ మిరాల్స్ ఏకైక గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌తో తన విశిష్టమైన 18 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికిన 'ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ' గా గుర్తింపు పొందిన పీఆర్ శ్రీజేష్‌కు ఈ మెడల్ ఘనమైన వీడ్కోలు పలికింది.
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు పతకాల జాబితా గమనిస్తే..
గోల్డ్ - ఆమ్స్టర్డామ్ 1928
గోల్డ్- లాస్ ఏంజిల్స్ 1932
గోల్డ్ - బెర్లిన్ 1936
గోల్డ్ - లండన్ 1948
గోల్డ్ - హెల్సింకి 1952
గోల్డ్- మెల్బోర్న్ 1956 ఒలింపిక్స్
సిల్వర్ - రోమ్ 1960
గోల్డ్ - టోక్యో 1964
కాంస్యం - మెక్సికో సిటీ 1968
కాంస్యం- మ్యూనిచ్ 1972
గోల్డ్ - మాస్కో 1980
కాంస్యం - టోక్యో 2020