Spiritual: గుమ్మానికి మామిడాకులే ఎందుకు కట్టాలి.. దీని వెనక ఇంత రహస్యం ఉందా!
Spiritual: సాధారణంగా మన ఇంట్లో ఇళ్లల్లో శుభకార్యాలకి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటాము అయితే మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి.. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి తెలుసుకుందాం.
పెళ్లిళ్లకి పేరెంట్ కాలికి పండగలకు పబ్బాలకి ముందుగా మన ఇంటికి వచ్చే అతిధి మామిడాకులు. ఎందుకంటే రేపు శుభకార్యం అంటే మనం ఈరోజు రాత్రి కూర్చొని చక్కని తోరణాలు కట్టి గుమ్మానికి తగిలిస్తాం.
అలాగే కలశంలో పూజకి మామిడాకుల్నే పెడతాం ఇదంతా ఎప్పటినుంచో వస్తున్న ఆచారం కాన మామిడాకులే ఎందుకు వాడతారు అనే ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. ఇంతకీ మామిడాకులు మాత్రమే ఎందుకు కడతారు అంటే ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం.
దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టుని మన్మధుడి పంచ బాణాలలో ఒకటిగా వర్ణించాడు. అలాగే శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగింది. అలాగే శుభకార్యాలలో ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం కలుషితం అవుతుంది.
మామిడాకుల్లో నుంచి విడుదల అయ్యే ప్రాణవాయువు వాతావరణం స్వచ్ఛంగా ఉంచుతుంది. మామిడాకులని గుమ్మానికి కట్టడం వలన పరిసరాల్లో గాలి పరిశుభ్రమై ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. అలాగే మామిడాకుల వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ప్రసారమవుతుంది.
పూర్వం రోజుల్లో గ్రామాల్లో బావిలోకి దిగి బావిని శుభ్రం చేసే వారికి ముందుగా పెద్ద మామిడి కొమ్మని ఇచ్చి చుట్టూ కొంతసేపు తిప్పమని చెప్పేవారట ఇలా చేయడం వలన బావిలో ఉన్న విషవాయువులు తొలగిపోతాయని అప్పట్లోనే వాళ్ళు గ్రహించారు. పచ్చడి మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించటం వలన ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు సకల దేవత పరివారము వస్తుందని పండితుల ఉపవాచ.
దీనివలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. మామిడి ప్రేమ సంపద సంతానాభివృద్ధికి సంకేతమని రామాయణ భారతాల్లో కూడా ప్రస్తావించారు. చివరికి మానవుని ఆఖరి మజిలీ అయినా చావులో కూడా మామిడి కట్టెలని ఉపయోగిస్తారు. అందుకే మామిడి చెట్టుకి, మామిడి ఆకుకి అంత ప్రత్యేకత.