భాద్రపద అమావాస్య 2025: అమావాస్య రోజున ఏం చేయాలి..?
ఈ భాద్రపద అమావాస్య శనివారం వస్తోంది కాబట్టి.. దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తారు.ఈ అమావాస్య రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు.?

భాద్రపద అమావాస్య
భాద్రపద అమావాస్య 2025: హిందూ మతంలో అమావాస్యను చాలా ముఖ్యమైదిగా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఈ అమావాస్య రోజున దాదాపు అందరూ తమ పూర్వీకులను పూజిస్తారు. భాద్రపద మాసంలో వచ్చే ఈ అమావాస్యను కుశగ్రహిణి అమావాస్య లేదా ఫిథోరి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున, పూర్వీకులకు తర్పణం చేస్తారు.. దానధర్మాలు కూడా చేస్తారు. ఈ ఏడాది భాద్రపద అమావాస్యఆగస్టు 23వ తేదీన వస్తోంది. శనివారం వస్తోంది కాబట్టి.. శని అమావాస్య అని కూడా పిలుస్తారు.
భాద్రపద అమావాస్య ముహూర్తం...
పంచాంగం ప్రకారం, భాద్రపద అమావాస్య ఆగస్టు 22వ తేదీ శుక్రవారం ఉదయం 11:55 గంటలు ప్రారంభమౌతుంది. ఆగస్టు 23 శనివారం ఉదయం 11:35 గంటలకు ముగుస్తుంది.అయతే.. ఈ అమావాస్యను మాత్రం ఆగస్టు 23వ తేదీన మాత్రమే జరుపుకుంటారు.
భద్రపద అమావాస్య 2025 పూజా విధి..
ఈ రోజున, పవిత్ర నది, చెరువు లేదా కొలనులో స్నానం చేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించాలి. ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని పఠించాలి. దీని తర్వాత, శివుడిని పూజించాలి. ఆ తర్వాత మీ పూర్వీకులకు తర్పణం అర్పించాలి. పూజ తర్వాత, పేదవారికి ఆహారం ,దుస్తులు దానం చేయండి. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. భద్రపద అమావాస్య రోజున, వివాహిత స్త్రీలు రావి చెట్టును పూజిస్తారు. ఇలా చేస్తే.. పెళ్లి జరుగుతుందని నమ్ముతారు.
భద్రపద అమావాస్య నివారణలు
1. భద్రపద అమావాస్య రోజున స్వీట్ చేసి శివుడికి సమర్పించాలి. ఆ తర్వాత మీ పూర్వీకులకూ కూడా సమర్పించవచ్చు. దేవుడికి సమర్పించిన ఈ ప్రసాదాన్ని పేదలకు పంచి పెట్టొచ్చు. ఇక.. మీ పెద్దలకు పెట్టిన స్వీట్ ని జంతువులకు కూడా తినిపించొచ్చు.
2. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే.. స్నానం చేసి నారింజ రంగు దుస్తులు ధరించండి. శివ పార్వతులను పూజించాలి. "ఓం గౌరీశంకరాయ నమః" అని జపించండి. సాత్విక ఆహారాన్ని తయారు చేసి దానం చేయండి.