Spiritual: కాలసర్ప దోషం అంటే ఏంటి.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరిష్కారం ఎలా ఉంది?
Spiritual: పాపపుణ్యాల ఫలితంగా మనం అనేక కర్మలని ఎదురుకోవాల్సి వస్తుంది. అందులో ఒకటి కాలసర్ప దోషం. అలాంటి కాలసర్ప దోషాన్ని ఎలా పోగొట్టుకోవచ్చో చూద్దాం.
ఒక మనిషి జాతకం తను పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాల మీద అలాగే కర్మల మీద ఆధారపడుతుంది. పూర్వ జన్మలో పాపాలు ఎక్కువ చేస్తే ఈ జన్మలో కొన్ని చేదు సంఘటనలు, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందులో కాలసర్ప దోషం ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జాతకంలో రాహువు, కేతువు మధ్య మరే గ్రహాలు లేకపోతే దాన్ని కాలసర్ప దోషం అని అంటారు. ఈ దోషం వలన మనిషికి జీవితంలో కష్టాలు అనేవి ఎదుర్కోవలసి ఉంటుంది.
అడుగడుగునా సమస్యలు ఏర్పడతాయి. త్వరగా పెళ్లి కాకపోవడం, ఒకవేళ పెళ్లి జరిగినా సరే వైవాహిక సమస్యలు ఎదురవడం లాంటివి జరుగుతాయి. అనుకున్నవి ఏవీ అంత తేలిగ్గా జరగవు. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యమైన సమయంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం.
మూర్ఖంగా ప్రవర్తించడం లాంటివి జరుగుతాయి. వీటి వల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి.ఒక మనిషి తన జాతకంలో కాలసర్ప దోషం ఏ స్థానంలో ఉన్నదో అనేదాన్ని బట్టి శారీరక ఇబ్బందులు, సమస్యలు కూడా ఏర్పడతాయి. కానీ అన్ని సమస్యలకి పరిష్కారం ఉన్నట్టు దీనికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో పరిష్కారం ఉండనే వుంది.
అదేంటో తెలుసుకుందాం. ఈ కాల చక్ర దోషం పోవాలంటే సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేయాలి. పేరులో నాగా లేదా సుబ్రహ్మణ్య ఉండేటట్లు చూసుకోవాలి.ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలను దర్శించుకోవాలి. వైవాహిక సమస్యలు ఉన్నవారు రాహు, కేతువులకు శాంతి పూజ జరిపించాలి. అలాగే హోమాలు కూడా జరిపించడంలో ప్రయోజనం ఉంటుంది.
snake
ప్రతి మంగళవారం కుజ గ్రహానికి మరియు ప్రతి శనివారం రాహు, కేతువులకు పూజ చేయాలి. అలాగే దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా కొంత మంచి జరిగి కష్టాలు కాస్తో కూస్తో తగ్గుతాయి. ఇవి పాటించడం వలన కాలసర్ప దోషం ప్రభావం తగ్గి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.