MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Spiritual
  • శబరిమలకు వెళ్లే భక్తులు ఏం చేయాలి?

శబరిమలకు వెళ్లే భక్తులు ఏం చేయాలి?

కేరళలో ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతి ఏడాది భక్తులు వెళ్లివస్తుంటారు. ఈ ఆలయం ఈ సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయం, దాని చుట్టూ ఉన్న ప్రాంతం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 17 2023, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
sabarimala ayyappa

sabarimala ayyappa

కేరళలోని ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల ఆలయ సందర్శనానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం ఉంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్లిరావాలని చాలా మంది అనుకుంటారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి ఎగువన కొండపై  ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అందమైన పర్వతాలు, పచ్చని దట్టమైన అడవులు మనల్ని కనువిందు చేస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
sabarimala

sabarimala

అయ్యప్పస్వామి 

శివుడు, విష్ణువు (మోహిని అవతారం) కలయిక నుంచి అయ్యప్ప స్వామి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్పస్వామిని హరిహరపుత్రుడు అని కూడా అంటారు. అందుకే శబరిమల దక్షిణ భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర, పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
 

35
Sabarimala

Sabarimala

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులు ఏం చేయాలి?

శబరిమలకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వెళుతుంటారు. అయితే ఇక్కడికి వెళ్లే భక్తులు అయ్యప్పస్వామిని చిత్తశుద్ధితో పూజించాలి. అలాగే అయ్యప్పస్వామిని పూజించడానికి కొన్ని నియమాలను పాటించాలి. అయ్యప్పస్వాములు అయ్యే వారు  సాధారణంగా 41 రోజుల పాటు కఠిన ఉపవాసం ఉంటారు. ఇది సాధారణంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 24 వరకు ఉంటుంది.  అయ్యప్పస్వామి ఆలయం ఒక కొండపై ఉంటుంది. అందుకే ఉపవాసం ఉన్న భక్తులు దేవుడిపై నమ్మకం ఉంచితేనే ఈ ఆలయానికి చేరుకుంటారని నమ్మకం ఉంది. 

45
sabarimala

sabarimala

భక్తులు ఏం చేస్తారు?

శబరిమలకు వెళ్లే యాత్రికులు పాలతో ఉత్పత్తులను తప్ప మాంసాహారం అసలే తినకూడదు. రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. బూతు, అసభ్య మాటలను మాట్లాడకూడదు. అలాగే మందు, పొగాకును తీసుకోకూడదు. తీర్థయాత్ర పూర్తయ్యే వరకు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఈ ఆలయాన్ని సందర్శించేటప్పుడు భక్తులు నలుపు లేదా సాదా నీలం రంగు దుస్తులనే మాత్రమే ధరించాలి. కానీ కొంతమంది వైదిక నియమాల ప్రకారం కాషాయ దుస్తులను వేసుకుంటారు. 
 

55
Sabarimala

Sabarimala

పవిత్ర మెట్లు, వాటి ప్రాముఖ్యత

అయ్యప్ప ఆలయానికి వెళ్లే 18 మెట్లును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ఎన్నో అంశాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లు.. ఐదు ఇంద్రియాలను సూచిస్తే, తరువాతి ఎనిమిది మెట్లు ఎనిమిది ఇంద్రియాలను సూచిస్తాయి. తర్వాతి  మూడు త్రిగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక చివరి రెండు విద్య, అవిద్యకు ను సూచిస్తాయి. ఎవరైతే ఈ మెట్లు ఎక్కుతారో వారు అన్ని ప్రాపంచిక కోరికల నుంచి తమను తాము వేరు చేసుకుంటారని నమ్ముతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved