Raksha bandhan: సోదరుడికి వెండి రాఖీ కడితే ఏమౌతుందో తెలుసా?
ఈ సంప్రదాయానికి కొత్త కాంతి ఇచ్చే విధంగా, ఇటీవల కాలంలో వెండి, బంగారు రాఖీలు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అసలు.. ఇలా వెండి, బంగారు రాఖీలు కట్టొచ్చా..? కడితే ఏమౌతుంది?

రక్షా బంధన్
రక్షా బంధన్ అనేది భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పర్వదినాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాలను కోరుకుంటుంది. సోదరుడు ఆమెను జీవితాంతం కాపాడతానని ఈ రోజు హామీ ఇస్తాడు. రాఖీ అంటే.. దాదాపు చాలా మంది కేవలం రంగు రంగుల దారం మాత్రమే కట్టేవారు. కానీ, ఇప్పుడు మార్కెట్లోకి చాలా మోడల్స్ వచ్చాయి. దీనికి తగినట్లుగా... ఈ సంప్రదాయానికి కొత్త కాంతి ఇచ్చే విధంగా, ఇటీవల కాలంలో వెండి, బంగారు రాఖీలు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అసలు.. ఇలా వెండి, బంగారు రాఖీలు కట్టొచ్చా..? కడితే ఏమౌతుంది? అనే విషయం తెలుసుకుందాం...
KNOW
వెండి రాఖీ ప్రాముఖ్యత...
1.శుభాన్ని సూచించే లోహం..
వెండి శుభ్రతను సూచించే లోహంగా పరిగణిస్తారు. దీనిలో ఉన్న ఔషధ గుణాల వల్ల ఇది శరీరానికి హానికరమైన శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది. అందువల్ల, సోదరుడికి వెండి రాఖీ కట్టడం వల్ల సోదరుడికి శుభం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.
2. జాతకంలో చంద్రుని బలపరచడం
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, వెండి చంద్రునికి సంబంధించిన లోహం. ఇది మన మనస్తత్వాన్ని, భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. వెండి రాఖీ ధరించడం వల్ల చంద్రుని దోషాలు తగ్గి, మానసిక ప్రశాంతత, బలమైన భావోద్వేగ నిబద్ధత లభిస్తాయని విశ్వాసం.
3. శుక్రగ్రహ ప్రభావం
వెండి రాఖీ శుక్రగ్రహానికి బలాన్నిస్తుంది. ఇది ప్రేమ, శ్రేయస్సు, సౌందర్యాన్ని సూచించే గ్రహం. శుక్ర ప్రభావం బలపడడం వల్ల జీవితంలో అభివృద్ధి, లగ్జరీలు, సుఖ సౌకర్యాలు పెరుగుతాయి.
4. ప్రతికూలత తొలగింపు
వెండి రాఖీ వల్ల శరీరంలో సానుకూల శక్తులు పెరిగి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్మకం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా శుద్ధి చెందాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
బంగారు రాఖీ ప్రాముఖ్యత:
1. సంపదకు చిహ్నం
బంగారం సంపదకు, స్థిరతకు, సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. సోదరుడికి బంగారు రాఖీ కట్టడం ద్వారా, అతని జీవితంలో ధనం, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని నమ్ముతారు.
2. చిరస్మరణీయమైన బహుమతి
బంగారు రాఖీ కేవలం ఒక బహుమతి కాదు. అది ఒక ప్రత్యేక బంధానికి గుర్తుగా నిలిచే ప్రేమ నిబంధనం. ఇది లాంగ్ లాస్టింగ్ మెమొరీగా మారుతుంది.
3. రాజసాన్ని సూచిస్తుంది..
బంగారం రాజసికాన్ని, విలాసవంతమైన జీవనాన్ని సూచిస్తుంది. ఇది ధన్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సోదరుడికి గౌరవాన్ని చాటేలా బంగారు రాఖీ ఉంటుంది.
శుభ ముహూర్తంలో రాఖీ కట్టడం ఎందుకు అవసరం?
జ్యోతిష్య ప్రకారం, రాఖీ శుభ ముహూర్తంలోనే కట్టడం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా తూర్పు దిశలో ముఖం ఉంచి రాఖీ కడితే శుభ ఫలితాలుంటాయని నమ్ముతారు. అలాగే రాఖీ కట్టిన తర్వాత హారతి ఇవ్వడం వల్ల దురదృష్టం తొలగి, శుభశక్తులు వస్తాయని భావన.
తల్లిదండ్రుల పాత్ర:
ఈ సందర్భంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు రాఖీ వెనక ఉన్న సంస్కృతి, ఆధ్యాత్మికతను వివరించడం ఎంతో అవసరం. కేవలం గిఫ్ట్‌లు ఇవ్వడం కన్నా, కుటుంబ బంధాలను ముడిపెట్టే సంప్రదాయాన్ని మనవరకు మిగల్చే బాధ్యత తల్లిదండ్రులదే.
ఫైనల్ గా...
వెండి, బంగారు రాఖీలు కేవలం అలంకారాలే కాదు. అవి ఒక భావోద్వేగానికి, అనుబంధానికి, భద్రతకు ప్రతీకలు. ఈ రాఖీ పండుగను, మీ సోదరుడితో ఆత్మీయంగా జరుపుకోండి.