MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణుమూర్తికి అభిషేకం ఎలా చేయాలి?

ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణుమూర్తికి అభిషేకం ఎలా చేయాలి?

Utpanna Ekadashi 2023: ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. అందుకే ఈ ఏకాదశి తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం.. ఏకాదశి ఉపవాసం ఉత్పన్న ఏకాదశి నుంచే ప్రారంభమైందని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి మార్గశిర్ష మాసంలో జరుపుకుంటారు. ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి డిసెంబర్ 8వ తేదీన శుక్రవారం వచ్చింది. మరి ఈ ప్రత్యేకమైన రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి? ఎలా అభిషేకం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 07 2023, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Utpanna Ekadashi 2023: ఉత్పన్న ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు భక్తులు శ్రీమహావిష్ణువును నిష్టగా పూజిస్తారు. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఏకాదశి తిథి ఉత్తమమైందిగా భావిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీహరిని పూజిస్తారు. అలాగే ఆయనకు ఉపవాసం ఉంటారు. మార్గశిర్ష మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఈ రోజు ఈ దేవుడికి జలాభిషేకం కూడా చేస్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఉత్పన్న ఏకాదశి శుభ ముహూర్తం

మార్గశిర్ష మాసంలోని ఏకాదశి తిథి డిసెంబర్ 08 ఉదయం 05.06 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈ ఇది  మరుసటి రోజు అంటే డిసెంబర్ 09 ఉదయం 06:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఉత్పన్న ఏకాదశి ఉపవాసాన్ని డిసెంబర్ 08 న ఉంటారు. కాగా ఇదే సమయంలో వైష్ణవులు డిసెంబర్ 9న మహావిష్ణువుకు ఉపవాసం ఉంటారు. 
 

34

విష్ణువును ఎలా పూజించాలి? 

ఈ ఏకాదశి నాడు  బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఉపవాసం పాటించాలి. పూజ చేసేటప్పుడు శ్రీమహావిష్ణువుకు పసుపురంగులో ఉండే స్వీట్లను సమర్పించాలి. ఎందుకంటే పసుపు రంగు శ్రీ హరికి ఇష్టమైనదిగా భావిస్తారు. విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఈ రోజు రావిచెట్టుకు నీటిని సమర్పించండి. ఇది ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. 
 

44

ఇలా అభిషేకం చేయండి

ఏకాదశి నాడు పచ్చి ఆవుపాలలో కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. ఉత్పన్న ఏకాదశి నాడు దక్షిణ శంఖంలో గంగాజలాన్ని నింపండి. ఈ నీటితో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేయడం వల్ల దేవుడి అనుగ్రహం మీ కుటుంబం మొత్తంపై ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Monday Facts: సోమవారానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆరోజు శివుడినే ఎందుకు పూజించాలి?
Recommended image2
Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !
Recommended image3
Ashadam: ఆషాఢంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయకపోయినా..పండుగలకు కొదవలేదు..ఏమేం ఫెస్టివల్స్ చేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved