Chanakya Niti:ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం నరకమే..!
వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి అంటే వారి మధ్య నమ్మకం, ప్రేమ ఉండాలి. కానీ, దుష్ట స్వభావం ఉన్న స్త్రీ జీవితంలోకి వస్తే మీ లైఫ్ నరకం అవుతుంది. అలాంటి మహిళలకు దూరంగా ఉండాలి.

వైవాహిక జీవితం అనేది ప్రేమ, నమ్మకం, ఓర్పు, అవగాహనలపై ఆధారపడి ఉంటుంది. జీవితం ఆనందంగా సాగాలంటే.. భార్యభర్తలు ఇద్దరూ మంచి స్వభావం కలిగినవారై ఉండాలి.ఒకరిపై మరొకరికి ప్రేమ, అనుబంధం ఉండాలి. అలా కాకుండా..ఇద్దరిలో ఒకరు తప్పుడు దిశగా అడుగులు వేస్తే.. అది మొత్తం కుటుంబ వాతావరణాన్నిప్రభావితం చేస్తుంది.ముఖ్యంగా స్త్రీ స్వభావం సరిగా లేకపోతే.. అది ఆ కుటంబ శాంతిని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోకూడదో చాణక్యుడు చెప్పాడు. అది ఇప్పుడు తెలుసుకుందాం..

దుష్ట స్వభావం గల స్త్రీ ఉండే ఇంట్లో వైవాహిక జీవితం నరకంతో సమానం అవుతుంది. ఆమె మాటలు, పనులు కుటుంబ సభ్యుల్లో ఒత్తిడిని, అసంతృప్తిని పెంచతాయి. ఎటువంటి మానసిక శాంతి ఉండదు. దురుసుగా, కఠినంగా మాట్లాడే స్త్రీకు గౌరవం ఉండదు. అలాంటి మహిళల స్నేహం లేదా సహవాసం పాముతో కలిసి ఉండటంతో సమానం అని పూర్వ కాలం నుంచి పెద్దలు చెబుతుంటారు. చాణక్యుడు కూడా అదే చెప్పాడు.

ఇంతేకాదు, వ్యభిచార మార్గంలో నడిచే స్త్రీను పోషించడం కూడా పురుషునికి మానసికంగా, భౌతికంగా బాధను కలిగిస్తుంది. ఆమె ప్రవర్తన వల్ల కుటుంబ పరువు దెబ్బతింటుంది. పిల్లల పెంపకంపైన కూడా దుష్ప్రభావం పడుతుంది. తను మారుతుందని ఆశపడటం వృధా. ఆమె స్వభావాన్ని ఎవరూ మార్చలేరు. అటువంటి మహిళల నుంచి దూరంగా ఉండటం మేలు.

సంసారం అనేది సమాజ నిర్మాణానికి మూల స్తంభం. ఇది సుసంపన్నంగా ఉండాలంటే అందులో ఉండే మహిళ గుణవంతురాలు, మృదువుగా, ప్రేమగా ఉండాలి. అలా ఉంటేనే కుటుంబం ఆనందంగా, స్థిరంగా సాగుతుంది. లేకపోతే, జీవితం విషాదంగా మారుతుంది.