తులసి వివాహం నాడు ఇలా చేస్తే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు.. సంతాన సాఫల్యం కూడా కలుగుతుంది
Tulsi Vivah 2023: సనాతన ధర్మంలో తులసి వివాహం జరిగే రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు ఏదైనా పరిహారం చేస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు తులసిమాతకు సంబంధించిన కొన్ని పరిహారాలను చేశారంటే మీ వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అవేంటంటే?
Tulsi Vivah 2023: ప్రతి ఏడాది కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి రోజున తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ రోజును శాస్త్రాలలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది తులసి వివాహం నవంబర్ 24 అంటే ఈ రోజే జరగనుంది. తులసి వివాహం నాడు కొన్ని పనులను చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున మీరు ఏ పరిహారం చేసినా అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని జ్యోతిష్యులు చెప్తారు. మరి మన జీవితంలోని ఎన్నో సమస్యలు పోవడానికి ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైవాహిక జీవితం, ప్రేమ బంధంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించాలంటే..
వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాల్లో అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవి కొన్ని కొన్ని సార్లు బంధం విడిపోయే దాక తీసుకెళుతాయి. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తుంటే తులసి వివాహం నాడు అంటే ఈ రోజు మీ భాగస్వామితో మంగళాష్టకాన్ని పఠించండి. అలాగే తులసి మాతను, విష్ణువును పద్ధతి ప్రకారం పూజించండి. అయితే మీకు కలిసి పూజ చేయడం సాధ్యం కాకపోతే నిజమైన భక్తితో ఒంటరిగానైనా మీరు పూజించొచ్చు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించండి.
సంతోషం, శ్రేయస్సు కోసం
జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా గడపడం చాలా కష్టం. అయితే తులసి వివాహం నాడు తులసి తల్లి ముందు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. దీపాన్ని వెలిగించడంతో పాటుగా ఈ రోజు ఒక పాత్రలో గంగాజలాన్ని తీసుకుని అందులో తులసి ఆకులను వేసి ఇంటి మొత్తం చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. అలాగే ఇంటి నుంచి ప్రతికూలత ప్రభావం కూడా తగ్గుతుంది.
అదృష్టం, సంతాన సాఫల్యం కోసం
అంతే మంచే, సంతానం కలగాలని కోరుకుంటే తులసి వివాహం నాడు తులసి అమ్మవారికి నియమాల ప్రకారం శాలిగ్రామ స్వామితో వివాహం జరిపించండి. అలాగే అమ్మవారికి పదహారు అలంకరణ వస్తువులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది. అలాగే సంతానం కావాలనే కోరిక కూడా నెరవేరుతుంది.