Hampiలో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?
తుంగభద్ర నది (Tungabhadra river) ఒడ్డున ఉన్న హంపి (Hampi) అనేక సందర్శనీయ ప్రదేశాలను కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. హంపి సందర్శనకు వెళ్ళినప్పుడు విజయనగర పరిపాలనా కాలంలో నిర్మించిన అనేక అద్భుతమైన దేవాలయాల చారిత్రాత్మక కట్టడాలు, శిల్ప కళలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడి అనేక ఆలయాలు, అభయారణ్యాలు, డ్యాంలు, ప్రకృతి అందాలు పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే ఇప్పుడు హంపి సందర్శనకు వెళ్లినప్పుడు తప్పక సందర్శించవలసిన కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
హంపిలో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాల (Tourist places) జాబితాలో విజయ విఠల దేవాలయం, విరూపాక్ష దేవాలయం, నరసింహ స్వామి దేవాలయం, సాసువేకాళు గణపతి దేవాలయం, రాణీవారి స్నానాల స్విమ్మింగ్ పూల్, మాతాంగ హిల్స్, దరోజి అభయారణ్యం (Daroji Sanctuary), తుంగభద్ర డ్యాం వంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
ఈ సందర్శనీయ ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టతను (Uniqueness) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ ప్రాంతల సందర్శన పర్యాటకులకు ఆధ్యాత్మిక భావనను, ప్రశాంతతను (Calmness) చేకూరుస్తాయి. ఈ ప్రాంతాల ప్రత్యేకతను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విజయ విఠల దేవాలయం: హంపిలో ప్రధాన ఆకర్షణగా విజయ విఠల దేవాలయం (Vijaya Vithala Temple) ఉంది. ఈ దేవాలయంలో మహావిష్ణువును విఠల రూపంలో కొలుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న రాతి రథం (Stone chariot) భారతీయ శిల్పకళా చాతుర్యానికి గొప్ప నిదర్శనం.
హనుమాన్ దేవాలయం: హంపీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వత శిఖరంపై భాగంలో హనుమాన్ దేవాలయం (Hanuman Temple) ఉంది. ఈ ప్రదేశంలోనే హనుమంతుడు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర (Tungabhadra) నదిని తెప్పలతో దాటి మెట్ల దారి గుండా హనుమాన్ వెళితేనే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించవచ్చు.
తుంగభద్ర డ్యాం: హంపిలో తప్పక సందర్శించవలసిన ప్రదేశంగా తుంగభద్ర డ్యాం (Tungabhadra Dam) ఉంది. ఈ డ్యాం సందర్శన పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ డ్యాంకు పక్కన ఉన్న ఉద్యానవనం (Park) పర్యాటకులకు చక్కని అనుభూతిని అందిస్తుంది. ఏడు గంటల సమయంలో ఈ ఉద్యానవనంలో మ్యూజికల్ ఫౌటైన అందాలను తిలకించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
మాతాంగ హిల్స్: మాతాంగ హిల్స్ (Matanga Hills) పైభాగం నుండి చూస్తే హంపితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ పర్వతం పై భాగంలో వీరభద్ర దేవాలయాన్ని (Veerabhadra temple) దర్శించవచ్చు. ఈ పర్వత పై భాగం నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తాయి. పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా ఈ పర్వత శిఖరంపై భాగాన్ని చేరుకుంటారు.
నరసింహస్వామి దేవాలయం: ఏకశిలలో రూపొందించిన ఉగ్ర నరసింహస్వామి (Narasimhaswamy) విగ్రహం హంపిలో ఉన్న విగ్రహాలలో ప్రధాన ఆకర్షణగా (Attractive) ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 6.7 మీటర్లు ఉంటుంది. ఈ విగ్రహం క్రీస్తు శకం 1528 కి చెందినది. విజయనగర సామ్రాజ్యంపైకి మొఘల్ దండయాత్ర చేసినపుడు ఈ విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది.