MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మనాలిలో ఖచ్చితంగా సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే!

మనాలిలో ఖచ్చితంగా సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే!

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్ర రాజధాని అయిన సిమ్లా నుండి 250 కిలోమీటర్ల దూరంలో కులూ జిల్లాలో మనాలి ఉంది. మనాలి (Manali) హిమాచల్ ప్రదేశ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇది సముద్ర మట్టం నుండి 1950 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్నది. మనాలిలో సందర్శించడానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి ప్రతియేటా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మరి ఇప్పుడు మనం మనాలిలో సందర్శనకు వీలుగా ఉన్న కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. 

2 Min read
Navya G | Asianet News
Published : Jan 19 2022, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మనాలి అందమైన ప్రకృతి అందాలు, పూల వనాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, యాపిల్ తోటలతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మనాలి సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది. మనాలిలో ప్రధాన ఆకర్షణగా గ్రీన్ హిమాలయన్ పార్క్ (Green Himalayan Park), బియాస్ కుండ్ సరస్సు, రోహతంగ్ పాస్ (Rohtang Pass), హడింబ టెంపుల్, సోలన్ లోయ ఉన్నాయి.
 

27

వీటితో పాటు సందర్శనకు వీలుగా పండా డ్యాం, రఘునాథ్ టెంపుల్ (Raghunath Temple), చంద్రఖానీ పాస్ (Chandrakhani pass), జగన్నాథి దేవి టెంపుల్ ఇలా మొదలగునవి ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను కలిగి పర్యాటకులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. మనాలి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలు తప్పక సందర్శించండి. వీటి సందర్శన మీకు మధురానుభూతిని కలిగిస్తుంది.
 

37

హడింబ టెంపుల్: హడింబ టెంపుల్ (Hadimba Temple) మనాలిలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం రాక్షసి అయిన హడింబి చెల్లెలు అయిన హడింబా దేవికి అంకితమిస్తూ (Dedicated) క్రీ.శ. 1533 లో నిర్మించారు. ఈ దేవాలయం భూమి నుంచి ఉద్భవించే ఒక పెద్ద రాతి నుంచి నిర్మించబడినది.

47

కనుక ఈ దేవాలయంలోని రాతిని దేవతకి ప్రతిరూపంగా భావించి భక్తులు పూజిస్తారు. ఈ ఆలయాన్ని పోలిన నిర్మాణాన్ని (Structure) మరెక్కడా నిర్మించకుండా ఉండేందుకు ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కళాకారుల కుడిచేతిని నరికించాడు ఆనాటి రాజు. ఇక్కడ జరిగే ఘోర్ పూజను (Ghor Puja) తిలకించడానికి అనేక మంది భక్తులు వస్తుంటారు.
 

57

బియాస్ కుండ్ సరస్సు: మనాలిలో ఉన్న బియాస్ కుండ్ సరస్సుకు (Beas Kund Lake) ఒక ప్రత్యేకత ఉంది. మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడు ఈ సరస్సులోనే స్నానమాచరించే వారని పురాణ కథనం. ఈ సరస్సులో స్నానమాచరిస్తే అన్ని చర్మ వ్యాధులు (Skin diseases) నయమవుతాయని ఇక్కడివారి నమ్మకం.
 

67

జగన్నాథి దేవాలయం: మనాలిలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో జగన్నాథి దేవాలయం (Jagannathi Temple) ఒకటి. ఈ దేవాలయాన్ని 1500 సంవత్సరంలో క్రితం నిర్మించారు. భగవంతుడు విష్ణువు చెల్లెలు అయినా భువనేశ్వరిని దేవిని ఈ దేవాలయంలో పూజిస్తారు. ఈ దేవాలయ సందర్శన ఆధ్యాత్మిక (Spiritual) భావనను కలిగిస్తుంది.
 

77

సోలంగ్ లోయ: మనాలిలో ఉన్న మరొక ప్రత్యేక ఆకర్షణగా సోలంగ్ లోయ (Solang Valley) ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే వింటర్  స్కీయింగ్ ఫెస్టివల్ (Winter Skiing Festival) కు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంత సందర్శనలో పారా గ్లైడింగ్, మౌంటెన్ బైకింగ్, స్కీయింగ్ మొదలగు క్రీడలలో పాల్గొనవచ్చు. ఈ ప్రాంత సందర్శన పర్యాటకులను అమితంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved