ఉత్తరప్రదేశ్ లోని సాకేతపురంలో చూడవలసిన అద్భుత పర్యాటక ప్రదేశాలు ఇవే!
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని ఒక ముఖ్యమైన పట్టణంగా అయోధ్య ఉంది. అయోధ్య సాకేతపురంగా (Saketapuram) ప్రసిద్ధి. శ్రీ మహా విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం ఇది. ఇది పరమ పవిత్రమైన ప్రదేశం. ఈ ప్రదేశ సందర్శన పర్యాటకులకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అయోధ్యలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటి సందర్శన మీకు తప్పక నచ్చుతుంది. అయోధ్యలో సందర్శనకు వీలుగా ఉన్న పర్యాటక ప్రదేశాలు ఏంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సరయూ నది (Saryu River) కుడివైపు తీరాన ఉన్న అయోధ్య ఫైజాబాద్ (Faizabad) కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ రామచంద్రుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలించేవారు. భారతదేశంలో తప్పక సందర్శించవలసిన చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అయోధ్య బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం.
ఈ నగరంలో మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధ ఆలయాలు, శిక్షణ కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యలో ముందంజలో ఉండేది. ఇక్కడ ఫాహియాన్ (Fahien) అనే చైనా సన్యాసి బౌద్ధమత మఠాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అయోధ్యలో (Ayodhya) సందర్శనకు వీలుగా ఉన్న ప్రదేశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కౌసల్యాదేవి మందిరం: శ్రీ రామచంద్రుని తల్లి అయినా కౌసల్యాదేవి మందిరం (Kausalyadevi Mandiram) ఇక్కడ మాత్రమే ఉంది. ఈ మందిరంలో కౌసల్యాదేవి, దశరథులతో పాటు శ్రీ రామచంద్ర స్వామి (Sri Ramachandra swamy) ఉండడం ప్రత్యేక విశేషం.
వాల్మీకి మందిరం: వాల్మీకి మందిరంలో (Valmiki mandiram) వాల్మీకి మహర్షితో పాటు లవకుశులు ఉండడం ప్రత్యేక విశేషం. పాలరాతితో (Marble) నిర్మించబడిన ఈ మందిరం గోడలపై వాల్మీకి రామాయణంలోని 24 వేల శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి.
హనుమద్ మందిరం: ఈ హనుమద్ మందిరం (Hanumadh mandiram) ప్రత్యేక విశిష్టతగా నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది. ఈ దేవాలయ సందర్శన మనకు ఆధ్యాత్మిక భావనతో (Spiritual Concept) మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.
అన్నదాన సమాజం: అన్నదాన సమాజం (Annadana Samajam) ముఖ్య ఉద్దేశం అయోధ్యలో భిక్షువులు ఉండకూడదని. దీనికోసం దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ గోశాలలో 200కు పైగా గోవులు (Cows) ఉన్నాయి.
కనక మహల్: కనక మహాల్ (Kanaka Mahal) ను కైకేయీ, దశరథులు సీతారాముల వివాహ కానుకగా ఈ భవనాన్ని వారికి ఇచ్చారని పురాణకథనం. అయితే ప్రస్తుతం ఉన్న భవనం విక్రమాదిత్యుడు (Vikramaditya) నిర్మించారని కథ ప్రచారంలో ఉంది.
సరయూ నది స్నాన ఘట్టం: సరయూ నది జలాలు తేటగా శుభ్రంగా ఉంటాయి. సరయూ నది (Saryu River) స్నాన ఘట్టం తీర ప్రాంతం బంకమట్టితో (Clay) నిండి ఉంటుంది. ఈ నది తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. కనుక సందర్శించే సమయంలో కాస్త జాగ్రత్త వహించడం అవసరం.