MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఊటీలో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు.. పూర్తి వివరాలు ఇవే!

ఊటీలో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు.. పూర్తి వివరాలు ఇవే!

హిల్ స్టేషన్ క్వీన్ (Hill Station Queen) అయిన ఊటీ (Ooty) సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది. ఇక్కడి దట్టమైన ఆకుపచ్చని లోయలు, అందమైన ప్రకృతి సౌందర్యాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఊటీలో  సందర్శించవలసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి.  అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఊటీలో సందర్శనకు వీలుగా ఉండే ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. 

2 Min read
Navya G | Asianet News
Published : Jan 01 2022, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బొటానికల్ గార్డెన్స్: ఊటీలో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశంగా బొటానికల్ గార్డెన్స్ ఉంది. ఈ గార్డెన్స్ 1848లో నిర్మించబడ్డాయి. బొటానికల్ గార్డెన్స్  (Botanical Gardens) అందమైన పువ్వులు, ఫెర్న్స్, ఆర్కిడ్లు వివిధ అద్భుతమైన అందాలతో నిండి చూసేందుకు కనులవిందుగా ఉంటుంది. ఈ అద్భుతమైన తోటలు పర్యాటకుల మనసుకు ఆహ్లాదాన్ని (Enjoy) కలిగిస్తాయి.
 

27

టాయ్ ట్రైన్: ఊటీలో ప్రధాన ఆకర్షణగా టాయ్ ట్రైన్ (Toy train) ఉంది. ఇది ఒక అందమైన బొమ్మ రైలు. 1899 సంవత్సరంలో ఈ ట్రైన్ ను ప్రారంభించారు. ఈ ట్రైన్ నీలగిరి మౌంటెన్ రైల్వే టాయ్ ట్రైన్ (Nilgiri Mountain Railway Toy Train) అని పిలువబడుతోంది. ఈ అందమైన ట్రైన్ లో కూర్చొని అడవి, సొరంగాలు, పొగమంచు, పక్షుల మధ్య ప్రయాణం చేస్తుంటే  ఈ ప్రయాణం మనకు ఒక మధురానుభూతిని అందిస్తుంది.  
 

37

దొడ్డబెట్ట శిఖరం: ఊటీలో ఉన్న అతి ఎత్తైన శిఖరంగా దొడ్డబెట్ట శిఖరం (Doddabetta) ఉంది. ఈ శిఖరం సముద్ర మట్టానికి (Sea level) 2,623 మీటర్ల ఎత్తులో ఉంది. ఊటీకి వెళ్ళినపుడు ఈ శిఖరాన్ని తప్పక సందర్శించండి.
 

47

కామ్‌రాజ్ సాగర్ సరస్సు: ఊటీ శివార్లలో  కామ్‌రాజ్ సాగర్ సరస్సు (Kamraj Sagar Lake) ఉంది. ఈ సరస్సు అనేక రకాల మూలికలు (Herbs), పొదలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఇక్కడి స్థానిక వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఊటీ సందర్శనలో భాగంగా ఈ సరస్సును తప్పక సందర్శించండి.
 

57

కోటగిరి హిల్ స్టేషన్: ఊటీ అతి పెద్ద హిల్ స్టేషన్ గా ఉంటే దాని తరువాత రెండవ స్థానంలో కోటగిరి హిల్ స్టేషన్ (Kotagiri Hill Station) ఉంది. ఇది ట్రెక్కింగ్ (Trekking) చేసే పర్యాటకులకు ఉత్తమైన ప్రదేశంగా ఉంది. ఈ హిల్ స్టేషన్ సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది.
 

67

అన్నామలై ఆలయం: ఊటీకి 20 కిలోమీటర్ల దూరంలో అన్నామలై ఆలయం (Annamalai Temple) ఉంది. కొండ పైభాగంలో ఉన్న ఒక వేదశాలకు (Theology) కూడా ఇది కేంద్రంగా ఉంది. ఊటీలో తప్పక సందర్శించవలసిన జాబితాల్లో ఈ ఆలయం ఉంది.
 

77

సెయింట్ స్టీఫెన్స్ చర్చి: నీలగిరిలో అతి పురాతనమైన చర్చలలో ఒకటిగా సెయింట్ స్టీఫెన్స్ చర్చి (St. Stephen's Church) ఉంది. ఈ ఆంగ్లికన్ కేథడ్రల్ (Anglican Cathedral) 1829లో ప్రారంభమైంది. ఈ చర్చిలో అందమైన గాజు చిత్రలేఖనాలు, చెక్క పనులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ చర్చి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
Recommended image2
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!
Recommended image3
Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved