MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • కర్ణాటకలోని బైందూర్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రధాన ప్రాంతాలు ఇవే..!

కర్ణాటకలోని బైందూర్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రధాన ప్రాంతాలు ఇవే..!

కర్ణాటకలోని (Karnataka) ఉడుపి జిల్లా కుందాపురలో బైందూర్ (Byndoor) విహార ప్రదేశం ఉంది. బైందూర్ లోని అందమైన వాతావరణం, బీచ్లు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. వీటిని సందర్శించడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.  బైందూర్ లో సందర్శనకు వీలుగా ఉన్న ప్రధాన ఆకర్షణలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

2 Min read
Navya G | Asianet News
Published : Jan 25 2022, 11:48 AM IST| Updated : Jan 25 2022, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పురాణ ఇతిహాసాల ప్రకారం ఈ గ్రామంలోని ఒట్టినెనె కొండ వద్ద ఘోర తపస్సు (Penance) చేసిన రుషి బిందు పేరుతో బైందూర్ గా ఏర్పడింది. ఒట్టినెనె కొండ ఎక్కి సూర్యాస్తమయం, సముద్రం, బీచ్ లను చూస్తే మరింత అందంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతం అనేక బీచ్ (Beach) లకు ప్రసిద్ధి.
 

28

ఈ గ్రామంలో ప్రధాన ఆకర్షణగా శ్రీ రామచంద్ర మందిర్, సోమేశ్వర దేవాలయం (Someshwara Temple), శనీశ్వర దేవాలయం, మహాకాళి దేవాలయం, మూకాంబిక దేవాలయం, బెలక తీర్థ జలపాతాలు, బైందూర్ బీచ్ (Byndoor Beach), క్షితిజ నేసర ధామ ఇలా మొదలగునవి ఉన్నాయి.
 

38

సోమేశ్వర దేవాలయం: బైందూర్ బీచ్ కు సమీపంలో బైందూర్ నది, అరేబియా సముద్రం పక్కన సోమేశ్వర దేవాలయం (Someshwara Temple) ఉంది. శివభగవానుడికి అంకితమిస్తూ ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ అద్భుతమైన శిల్పాలు, గుడిలో లింగం ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అలాగే హిందువుల దేవత పార్వతి దేవి ఇక్కడ పుల్లూరు శ్రీ మూకంబికా దేవాలయంలో ప్రసిద్ధి చెందిన దేవత.  ఈ దేవాలయ సందర్శన మనసుకు ఆధ్యాత్మిక భావనను కలిగించి ప్రశాంతతను చేకూరుస్తుంది.
 

48

శ్రీ రామచంద్ర మందిర్: బైందూర్ లో ప్రధాన ఆకర్షణ (Attraction) దేవాలయంగా శ్రీ రామచంద్ర మందిర్ (Sri Ramachandra Mandir) ఉంది. ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీరాముని విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అనేకమంది పర్యాటకులు వస్తుంటారు.
 

58

శనీశ్వర దేవాలయం: బైందూర్ లోని అతి పురాతనమైన (Ancient) దేవాలయాలలో శనీశ్వర దేవాలయం (Shaneeswara Temple) ఒకటి. బైందూర్ లో ప్రధాన ఆకర్షణగా ఉన్నా ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.
 

68

మహాకాళి దేవాలయం: బైందూర్ లోని మూడు వందల సంవత్సరాల కిందటి మహాకాళి దేవాలయం (Mahakali Temple) ఉంది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని చిత్రపూర్ సరస్వత్ కుటుంబం (Chitrapur Saraswat family) నడుపుతోంది. బైందూర్ కి వెళ్లినప్పుడు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించండి.
 

78

బైందూర్ బీచ్: బైందూర్ లో ఆకర్షణగా బైందూర్ బీచ్ (Byndoor Beach) ఉంది. మరావంతే బీచ్ (Maravanthe Beach) నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి ఈ బీచ్ కు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి అందమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.
 

88

క్షితిజ నేసర ధామ: ఉడిపి (Udupi) నుండి 92 కిలోమీటర్ల దూరంలో క్షితిజ నేసర ధామ (Kshitija Nesara Dhama) ఉంటుంది. ఈ ప్రదేశం సహజసిద్ధమైన అందాలతో, తాటి, కొబ్బరి చెట్లతో అందమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రదేశ సందర్శన పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved