Diwali: దీపావళి షాపింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే, మీ డబ్బులు ఆదా అవ్వడం పక్కా..!
Diwali : పండగకు కొత్త దుస్తులు కొనాలి, క్రాకర్స్, స్వీట్స్ తో ఇల్లు నిండిపోవాలి. అయితే... మన జేబుకు చిల్లు పడకుండా, డబ్బు ఆదా చేసుకుంటూ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అప్పుడే పండగ ఆనందం రెట్టింపు అవుతుంది.

Festival Shopping
దీపావళి భారతీయులు అతి పెద్ద పండగ. ఈ రోజున ప్రతి ఒక్కరూ అందంగా మెరిసిపోవాలని అనుకుంటారు. అందుకే, దాదాపు అందరూ ఈ పండగకు ఎంతో కొంత షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేయాలనే వీరి కోరికకు తగినట్లే... బయట ఆఫర్ల వర్షం కురుస్తుంది. దీంతో... తక్కువ ధరకు వచ్చేస్తున్నాయి అని కొనేస్తాం. అయితే... కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... ఈ దీపావళి వేళ మీరు చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
1. ఏం కావాలో లిస్ట్ తయారు చేసుకోవాలి....
దీపావళి పండగ రోజున ఏదైనా షాపింగ్ చేసే ముందు ఫస్ట్... మీరు ఏం కనాలి అనుకుంటున్నారు అనే దానిని ముందు ఓ లిస్టు చేసుకోవాలి. మీకు, మీ ఇంటికి ఏం అవసరం అనే లిస్టు రాసుకుంటే.. అనవసరపు ఖర్చులు చేయరు. దీని వల్ల చాలా వరకు అధిక ఖర్చు చేయరు. ఫలితంగా డబ్బు ఆదా చేయగలరు.
లిస్టు మాత్రమే ఫాలో అవ్వాలి....
లిస్టు తయారు చేసుకున్న తర్వాత... కచ్చితంగా దానినే ఫాలో అవ్వాలి. చాలా మంది.. లిస్టు లో రాసుకోనివి కూడా కొనేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా అనవసరపు ఖర్చులు చేసినవారు అవుతారు. అందుకే... ఏది కొనాలన్నా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.. మనకు కొన్ని కావాలని అనిపిస్తాయి.. కొన్ని నిజంగా అవసరం అవుతాయి. కావాలి అనే దానికంటే.. అవసరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు... ఖర్చులు కంట్రోల్ లో ఉంటాయి.
3.ఆఫర్లకు లొంగిపోవద్దు...
పండగ వేళ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో మనల్ని ఆకర్షించేలా చాలా డిస్కౌంట్లు ప్రకటిస్తారు. అవి మంచి డీల్సే కావచ్చు. కానీ... అవసరం లేకుండా కొంటే డబ్బు వృథా అయిపోతుంది. తక్కువకు వస్తుందని కొని, తర్వాత వాటిని వాడకపోతే అది వేస్ట్ ఖర్చే అవుతుంది. అందుకే.. ఆఫర్లకు టెంప్ట్ అవ్వకూడదు.
ఆఫర్ స్కామ్‌ల బారిన పడకండి.
హోల్‌సేల్ దుకాణాలు, మాల్స్ , పెద్ద షాపింగ్ దుకాణాలలో ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. కొన్ని ఆఫర్లతో పాటు మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా కొనే ముందు అది నిజంగా మంచి ఆఫరో, లేదా స్కామో తెలుసుకొని కొనుగోలు చేయాలి.
బ్యాంక్ కార్డుల ద్వారా లభించే ఆఫర్లు
చాలా బ్యాంకులు దీపావళికి డెబిట్ , క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు , క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా తనిఖీ చేసి, ఏ కార్డ్ ఉత్తమ డీల్‌ను అందిస్తుందో చూడండి. దాని వల్ల భారీ డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.
డిస్కౌంట్ సరిగా చూసుకోవాలి...
చాలా మంది షాపింగ్ చేసే సమయంలో.. ఒకదానికి డిస్కౌంట్ ఉంటే.. చూసుకోకుండా మరొకటి కొనేస్తారు. బిల్లు చేయించాక గానీ తెలీదు. అందుకే.. ఏది కొంటున్నాం అనేది ఒకటికి, రెండు సార్లు చూసుకోవాలి.
షాపింగ్ చేసే సమయం...
వీకెండ్స్, హాలీడేస్ లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువ మంది ఉన్నప్పుడు.. నచ్చింది కొనుక్కునే ఛాన్స్ ఉండదు. కాబట్టి... చూసుకొని... రద్దీ తక్కువగా ఉన్నప్పుడు అంటే... వీక్ డేస్ లో వెళ్లాలి. అప్పుడు మీకు నచ్చింది.. చూసుకొని కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది.