MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఈ నాలుగు పదాలు శనీశ్వరుడికి విపరీతంగా కోపం తెప్పిస్తాయి.. జాగ్రత్త..!

ఈ నాలుగు పదాలు శనీశ్వరుడికి విపరీతంగా కోపం తెప్పిస్తాయి.. జాగ్రత్త..!

శని అనుగ్రహిస్తే.. జీవితంలో మంచి స్థాయికి వెళ్లగలుగుతారు. అదే శనికి మీపై కోపం వస్తే మాత్రం ఊహించని కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 19 2025, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
shani dosh
Image Credit : stockPhoto

shani dosh

తొమ్మది గ్రహాలలో శనిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. శని కోపం నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. శనికి మన మీద కోపం వస్తే.. చాలా సమస్యలు ఎదుర్కోవలిసి వస్తుంది. ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, పనిలో ఒత్తిడి, చికాకు, కోపం అన్నీ పెరిగిపోతాయి. అంతేకాకుండా.. మనకు తెలీకుండానే చెడు అలవాట్లకు అలవాటు పడతారు. తెలీకుండానే మోసాల్లో చిక్కుకుంటారు. జీవితంలో పురోగతి చూడటం కష్టం అవుతుంది. ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే.. శని అనుగ్రహం ఉన్నా.. మనం మాట్లాడే కొన్ని మాటల ద్వారా శని కోపాన్ని గురి అయ్యే ప్రమాదం ఉంది. మరి.. శని దుష్ప్రభావాలు లేకుండా ఉండాలంటే... ఎలాంటి పదాలు మాట్లాడకూడదో తెలుసుకుందాం...

శని దేవుడికి తేడాలు ఉండవు. పేదవాడా, ధనవంతుడా, తెలుపు, నలుపు అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరికీ వారు చేసిన తప్పులకు తగినవిధంగా శిక్షలు విధించేవాడే శని. తప్పు చేసి పోలీసులు, కోర్టుల నుంచి అయినా శిక్ష తప్పించుకోవచ్చేమో కానీ.. కర్మ నుంచి మాత్రం తప్పించుకోలేరు. కచ్చితంగా శిక్ష పడుతుంది. అదేవిధంగా మనం మాట్లాడే మాటలు కూడా సరిగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  1.నేనే సహాయం చేశాను...
Image Credit : stockPhoto

1.నేనే సహాయం చేశాను...

మనిషికి మనిషి సహాయం చేసుకోవడం తప్పనిసరి. అయితే.. చేసిన సహాయాన్ని చాలా రహస్యంగా ఉంచాలి. నువ్వు సహాయం పొందితే అందరికీ చెప్పుకోవచ్చు.. అది మంచిదే. కానీ, సహాయం చేసిన వాళ్లు మాత్రమే.. తామే సహాయం చేశామని మాత్రం గొప్పలు చెప్పుకోకూడదు. మీరు ఇలా చెప్పుకోవడం సహాయం పొందిన వారికి ఇబ్బంది కలిగించవచ్చు. ఆల్రెడీ బాధలో ఉన్నవారు మరింత బాధపడే అవకాశం ఉంటుంది.దీని వల్ల.. మీరు చేసిన దానికి కూడా విలువ ఉండదు. కాబట్టి, గొప్పలు చెప్పుకోకూడదు. ఈ అలవాటు శనికి నచ్చదు.

34
2.విజయానికి కారణం నేనే...
Image Credit : Asianet News

2.విజయానికి కారణం నేనే...

ఏదైనా విజయం సాధించినప్పుడు, అది నా వల్లే జరిగింది అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ, మీ శ్రమ లేకుండా.. ఆ విజయానికి క్రెడిట్ తీసుకోవడాన్ని శని దేవుడు హర్షించడు. పైగా శిక్షించే ప్రమాదం ఉంది. అహంకారపు మాటలను శని అస్సలు సహించడు. వేరొకరి శ్రమకు తాము క్రెడిట్ తీసుకునేవారిపై శని కన్నెర్ర చేసే ప్రమాదం ఉంది.

44
3.దేవుడికి నేనంటే ఇష్టం..
Image Credit : Getty

3.దేవుడికి నేనంటే ఇష్టం..

విశ్వాసం, క్రమశిక్షణ, శ్రద్ధ , ప్రేమతో జీవించే వారికి ఎల్లప్పుడూ దేవుని దయ ఉంటుంది. కానీ కొంతమంది, ఎటువంటి సద్గుణాలు లేకుండా, తాము దేవునికి ఇష్టమైన కుమారులమని చెబుతూ తిరుగుతారు. అదే అందరికీ చెప్పి నమ్మిస్తారు. కానీ శని అలాంటి మాటలను ఎప్పుడూ క్షమించడు. దేవుని దయ పొందడానికి, ఒకరు సంసిద్ధత , సద్గుణాలను కలిగి ఉండాలి.

4.నేను ఏమి చేసినా, దేవుడు నన్ను క్షమిస్తాడు..

మానవులు తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకుని జీవితాన్ని గడపాలి. కానీ కొంతమంది తమ తప్పులను గ్రహించకుండా లేదా తమ తప్పుల గురించి తెలుసుకోకుండా జీవిస్తారు. వారు చేసే అన్ని చెడు పనులను దేవుడు క్షమిస్తాడనే మనస్తత్వంలో ఉంటారు. అంతే కాదు, వారు పదే పదే అదే మాట చెబుతూ ఉంటారు. కొంతమంది, 'ఏ దేవుడు వచ్చినా, అతను నన్ను ఏమీ చేయలేడు' అని అంటారు. అలాంటి మాటలు కూడా శనికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కాబట్టి.. ఈ మాటలు పొరపాటున కూడా మాట్లాడకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image2
Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్
Recommended image3
Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Shani: శని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..?
Recommended image2
Shani Transit: ఉత్తర భాద్రపద నక్షత్రంలో శని... ఈ రాశులకు పరీక్షా కాలమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved