Spiritual: గరుడ పురాణం ఏం చెప్తుంది.. ఇలాంటి తప్పుకి ఈ శిక్షలు ఖాయమేనా?
Spiritual: సాధారణంగా మానవుడు తప్పు చేసినప్పుడు ఆ పాపానికి తగిన తగిన శిక్ష కచ్చితంగా ఉంటుందని గరుడ పురాణం చెప్తుంది. అయితే ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో ఇక్కడ చూద్దాం.
మనం ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తాము, చనిపోయిన తర్వాత మరుజన్మ మనం చేసే పాపపుణ్యాలను బట్టి ఉంటుందని గరుడ పురాణంలో వివరించబడింది. అయితే ఎలాంటి పాపాలు చేస్తే వచ్చే జన్మలో ఎలాంటి శిక్షలు పడతాయో చూద్దాం.
గరుడ పురాణం ప్రకారం ఈ జన్మలో మోసం చేసిన వారు వచ్చే జన్మలో గుడ్లగూబలుగా పుడతారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు వచ్చే జన్మలో గుడ్డివాడుగా పుడతారు. అలాగే జంతువులని హింసించేవారు వాటిని సరదాల కోసం వేటాడే వారు వచ్చే జన్మలో కసాయి చేతిలో మేకగా జన్మిస్తాడు.
అలాగే తల్లిదండ్రులని, తోబుట్టువులని వేధించే వ్యక్తి అసలు జన్మని పొందలేడు. వాడు గర్భంలోనే చనిపోతాడు. అలాగే గురువులని అవమానిస్తే దేవుడిని అవమానించినట్లే అని గరుడ పురాణం చెప్తుంది. ఇలా గురువుని అవమానించిన వారు వచ్చే జన్మలో నీరులేని అడవిలో పుడతారు.
అలాగే మహిళలను చంపడం, గర్భస్రావం చేయటం, గోమాతలను హింసించడం వంటివి చేస్తే వచ్చే జన్మలో చెడు యోనిలో జన్మిస్తారు. అలాగే డబ్బు ఉందని గర్వపడే వ్యక్తి లక్ష్మీదేవి కోపానికి బలవుతారు. అలాంటి వ్యక్తుల వద్ద సంపద నశించడం ప్రారంభమవుతుంది. అలాగే గరుడ పురాణం ప్రకారం ఇతరుల సంపదపై నిఘా ఉంచేవాడు ఎప్పటికీ సంతోష కరమైన జీవితాన్ని గడపలేడు.
అలాగే ఎవరైతే తాము సంపాదించిన సొమ్ములో కొంత భాగం కూడా దానం చేయకుండా ఉంటారో వారి వద్ద లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదట. అంతేకాదు అలాంటి వ్యక్తులు ఎప్పుడూ మానసికంగా బలహీనంగా ఉంటారు. అంతేకాకుండా కష్టాలకి దూరంగా పారిపోయే వ్యక్తులు ఎప్పటికీ విజయవంతం కాలేరు.
అంతేకాదు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ కష్టపడే వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే చనిపోయే ముందు దైవ నామస్మరణ చేయటం వలన వచ్చే జన్మలో దైవసాన్నిద్యానికి దగ్గరలో జన్మిస్తామని గరుడ పురాణం చెప్తుంది