Sankranthi 2022: తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ పిండి వంటకం ఏంటో మీకు తెలుసా?
కొత్త సంవత్సరంలో మొదట వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి (Sankranthi festival). ఈ సంక్రాంతి పండగ రోజున రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇంటికి వచ్చిన బంధువులతో ఇంటిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ పండుగ రోజున అనేక పిండి వంటకాలను తయారు చేస్తారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో (Telangana) ఈ పండుగ రోజున చేసే స్పెషల్ పిండి వంటకం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ పండుగకి కొత్త పంట (New crop) ఇంటికి వచ్చిన సందర్భంగా రైతులు సంక్రాంతి పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా (Happy) జరుపుకుంటారు. ఇంటికి వచ్చిన బంధువులకు, అతిథులకు, స్నేహితులకు అతిధి మర్యాదగా పండుగ రోజున చేసిన స్పెషల్ పిండి వంటకాలు వడ్డించి వారితో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ రోజున బొబ్బట్లు, మురుకులు, అరిసెలు, నిప్పట్లు వంటి పిండి వంటకాలు ఎక్కువగా తయారుచేస్తారు. అయితే తెలంగాణలో మాత్రం సంక్రాంతికి ఒక స్పెషల్ (Special) పిండి వంటకం ఉంది. ఆ స్పెషల్ పిండి వంటకం సకినాలు. ఇక్కడ చేసే సకినాలు (Sakinalu) అనేక ప్రాంతాలకు సప్లై అవుతాయి. వీటి రుచి కూడా బాగుంటుంది.
ఈ సకినాలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే తెలంగాణా ప్రాంతీయులు సకినాలను ఒత్తుకోవడానికి మిషన్ వాడకుండా చేతితో ఎంతో సులభంగా (Easily) గుండ్రంగా చుట్టుకుంటారు. వీటి తయారీ విధానం కూడా చాలా సులభం. ఈ సకినాల నెలరోజులైనా నిల్వ (Storage) ఉంటాయి.
సకినాలను తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని బాగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యం (Soaked rice) నీళ్లు వంపేసి ఒక కాటన్ క్లాత్ పై పరిచి ఫ్యాను లేకుండా నీడలోనే ఆరనివ్వాలి. గంట తరువాత బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ (Grind) చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని జల్లెడ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. సగం కేజీ బియ్యానికి రుచికి సరిపడా ఉప్పు (Salt), మూడు టీ స్పూన్ ల నువ్వులు (Sesame), సగం టీ స్పూన్ వాము (Ajawan), ఒక టీ స్పూన్ జీలకర్ర (Cumin seeds) వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా లూజ్ గా కలుపుకోవాలి.
పిండి మరీ మెత్తగా, మరి గట్టిగా కలుపుకోరాదు. మన చేతి నుండి సులభంగా పిండి పడేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ వస్త్రాన్ని (Cotton cloth) పరిచి దానిపై చేతికి తడి చేసుకుని సకినాల పిండిని తీసుకుని గుండ్రంగా చుట్టుకోవాలి. చేతికి తడి చేసుకుని సకినాలను చుట్టుకుంటే సులభంగా వస్తాయి.
ఇలా చుట్టుకున్న సకినాలు పది నిమిషాలు ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సకినాలను వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇలా తయారైన సకినాలను ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అంతే తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ (Ready).