Spiritual: ఆంజనేయ స్వామిని బేడీలతో ఎందుకు బంధించారు.. ఆ క్షేత్రం ఎక్కడ ఉంది!
Spiritual: మనుషులని పాప బంధనాల నుంచి విముక్తి చేసే ఆంజనేయ స్వామి ఓ రెండు క్షేత్రాలలో బేడీలతో కనిపిస్తారు. అయితే స్వామికి అలా ఎందుకు బేడీలు వేసారు, ఆ క్షేత్రం ఎక్కడ ఉంది, ఆ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భక్త జనాన్ని పాపాల నుండి, దుష్టశక్తుల నుండి కాపాడే ఆంజనేయస్వామిని బేడీలతో బంధించిన క్షేత్రం పూరి. ఒడిశాలోని పూరి జగన్నాథుడు కొలివైవున్న పూరీ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. ఈ పూరి క్షేత్రంలో చక్ర నారాయణ దేవాలయం పశ్చిమ భాగం లో సుభాష్ సర్కిల్ ఉంది. ఇక్కడికి ఎడమవైపున చక్ర తీర్థం ఉంది.
దాన్ని పక్కనే దరియా మహావీర దేవాలయం కూడా ఉంది. ఆంజనేయస్వామి పూరి క్షేత్రాన్ని సముద్రంలో మునిగిపోకుండా కాపాడుతున్నాడని అక్కడ వారి నమ్మకం. అందుకే అక్కడ కొలువై ఉన్న స్వామివారిని దరియా మహావీర హనుమ దేవాలయం అని అంటారు.
క్షేత్ర కథనం ప్రకారం పూరి జగన్నాథుడు పూరీలో కొలువైన తరువాత స్వామివారి దర్శనార్థం సముద్రుడు ఈ క్షేత్రానికి వస్తాడు. ఈ సమయంలో క్షేత్రంలోని వివిధ ప్రాంతాల్లోకి సముద్రంలోని నీరు వెళ్ళింది. దీంతో ఆ ప్రాంతంలో అపార నష్టం సంభవించింది దీంతో క్షేత్ర రక్షకుడిగా ఉన్న హనుమంతుడు గురించి జగన్నాథుడు వాకబు చేస్తాడు.
అయితే ఆ సమయంలో ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా హనుమంతుడు అయోధ్యకు వెళ్లాడని తెలుస్తుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పూరి జగన్నాథుడు ఇకపై హనుమంతుడు ఎక్కడికి వెళ్ళకుండా సంకెళ్ళతో బంధించండి అని ఆదేశాలు జారీ చేస్తాడు. అలా చేయడం వలన హనుమంతుడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడని తద్వారా ఈ క్షేత్రం సముద్రం పాలు కాకుండా కాపాడుతాడని జగన్నాథ స్వామి చెప్తారు.
అందువల్లే సముద్రం ఎంత పొంగినా ఇప్పటికీ పూరి క్షేత్రంలోకి ఒక చుక్క కూడా నీరు కూడా క్షేత్రంలోకి రాదని స్థానికులు చెప్తారు. అలాగే తిరుపతిలో కూడా ఒక బేడి ఆంజనేయస్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని బంధించడానికి గల కారణం ఏమిటంటే చిన్నతనంలో స్వామి ఎక్కువగా అల్లరి చేసేవాడు ఆ క్రమంలో ఒకసారి ఒంటిపై వెళతానని తన తల్లి అంజనాదేవి వద్ద అల్లరి చేసాడు.
అప్పుడు అంజనా దేవి హనుమంతుడిని బేడీలతో బంధించి తాను వచ్చేవరకు అక్కడే ఉండాలని చెప్పి ఆకాశగంగవైపు వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. అందువల్లే ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామికి బేడీ ఆంజనేయస్వామి అని పిలుస్తారు. తల్లి రాక కోసం ఆంజనేయస్వామి ఇప్పటికీ ఎదురుచూస్తున్నాడని చెప్తారు.