Spiritual: నిండు నూరేళ్లు సంసారం చల్లగా ఉండాలా.. అయితే ఈ శ్రావణమాసంలో ఈ పూజలు చేయండి!
Spiritual: శ్రావణమాసం అటు లక్ష్మీదేవికి ఇటు శివునికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనమాసం. ఈనెల మొత్తం ఉపవాసాలు పూజలతో గడుపుతారు హిందువులు. అయితే శ్రావణ మాసంలో ఏ రోజున శివుడికి ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో చూద్దాం.
శ్రావణ మాసంలో శుక్రవారం ఎంత ప్రాముఖ్యత ఉందో సోమవారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. చాలామంది శ్రావణ సోమవారం వ్రతాలు ఆచరిస్తారు. లక్ష్మీదేవికే కాదు శివునికి కూడా శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైనది.
ఈ మాసంలో శివుడిని పూజించడం వలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని పెద్దలు చెప్తారు. ఏ విధంగా పూజ చేస్తే ఎలాంటి కోరికలు తీరుతాయో ఇప్పుడు చూద్దాం. మీరు ఎవరికైనా మీ ప్రేమను వ్యక్తపరచబోతున్నట్లయితే బుధవారం రోజు చాలా మంచిది.
ఆ రోజు ఈశ్వరుని ప్రార్థించి తెల్లని పువ్వులు తీసుకెళ్లి ప్రపోజ్ చేయండి. కచ్చితంగా మీ కోరిక ఆ శివుడు తీరుస్తాడు. అలాగే ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ప్రతి సోమవారం భోలేనాథ్ ను పూజించాలి. ఆరోజు ఉదయాన్నే లేచి తలకు స్నానం చేయాలి.
తలకి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, కొంచెం గంగాజలం కలపాలి. స్నానం చేస్తున్నంతసేపు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన కచ్చితంగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటారు. అలాగే బుధవారం రోజు శివలింగానికి ఎరుపు రంగు పువ్వులు, కొన్ని పాలు, కుంకుమ సమర్పించడం వలన కోరుకున్న భాగస్వామిని పొందుతారు.
అలాగే సోమవారం ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రసన్నం అవుతారని పెద్దలు చెప్తారు. భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువైతే క్రమం తప్పకుండా పాలు, కుంకుమ, ఎర్రటి పువ్వులను ఒక గ్లాసు నీటిలో శివలింగానికి సమర్పించండి.
ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ప్రతి సోమవారం పెళ్ళికాని పిల్లలు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పసుపు లేదా తెలుగు బట్టలు వేసుకుని శివాలయానికి వెళ్లి శివ కుటుంబానికి పూజ చేయడం వలన వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.