MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మన కర్మ సరిగా లేదు అనడానికి సంకేతాలు ఇవే...!

మన కర్మ సరిగా లేదు అనడానికి సంకేతాలు ఇవే...!

మనకు కర్మ సరిగా లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయట. అవి మనకు కొన్ని సంకేతాల రూపంలో ముందుగానే చెప్పేస్తుందట. ఆ సంకేతాలు ఏంటో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 12 2022, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
spiritual

spiritual

ఏదైనా మనకు మంచి జరిగింది అంటే  చాలా సంబరపడిపోతాం. మన టైమ్ బాగుందని మురిసిపోతాం. కానీ అలా కాకుండా.. ఏదైనా చెడు జరిగితే.. మన టైమ్ బాలేదని అనుకుంటాం. మన కర్మ ఇంతే అని సరిపెట్టుకుంటాం. అయితే.. మనకు కర్మ సరిగా లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయట. అవి మనకు కొన్ని సంకేతాల రూపంలో ముందుగానే చెప్పేస్తుందట. ఆ సంకేతాలు ఏంటో ఓసారి చూద్దాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
meditation

meditation

1.చాలా మంది తమ కర్మ బాలేదని..ఫీలౌతూ ఉంటారు. ఈ క్రమంలో.. తమ కష్టాలకు తమనే బాధ్యులుగా భావిస్తూ...తమపై తాము అయిష్టత పెంచుకుంటూ ఉంటారు. కానీ.. మనపై మనకు గౌరవం లేకపోవడాన్ని , ఇష్టం లేకపోవడం లాంటివి చేయకూడదు. మనపై మనకే గౌరవం లేకపోతే.. ఇతరులు గౌరవం ఇస్తారు అనుకోవడం పిచ్చితనం. అది కూడా మనకు చెడు కర్మ తీసుకువస్తుంది. కాబట్టి.. ముందుగా.. ఎవరిని వారు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే.. ఆ కర్మను కూడా జయించవచ్చు.
 

39

2.మనకు మనసులో ఓ పని చేయాలని ఉంది. కానీ.. ఆ పని చేయాలంటే భయం. ఒకటి కావాలి.. అది గెలుచుకోవాలి అన్నా కూడా భయమే. ఈ భయం కారణంగా కూడా  మన కర్మ చెడుగా ఉంటుందట. కాబట్టి... ముందుగా మనలోని భయాలను తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి. అప్పుడే కర్మ మనకు అనుకూలంగా ఉంటుంది.

49

3.మన చుట్టూ నెగిటివిటీ ఉంటే.. మన ఆలోచనలన్నీ నెగిటివ్ గానే ఉంటాయి. అప్పుడు కూడా మన కర్మ అలానే ఉంటుంది. కాబట్టి.. ముందు మన ఆలోచనలు పాజిటివ్ గా మార్చుకోవాలి. ముందు మన ఆలోచనలను పాజిటివ్ గా మార్చుకోవడం మొదలుపెడితే... తర్వాత చుట్టూ పరిస్థితులు కూడా పాజిటివ్ గా మారుతున్నట్లు గుర్తించవచ్చు. తద్వారా కర్మ సరిగా ఉంటుంది.
 

59

4.చాలా మంది తమ బ్యాడ్ ఆటిట్యూడ్ ని కలిగి ఉంటారు. వారిపై వారికి నమ్మకం ఉండదు. ఎదుటివారిపట్ల కొంచెం కూడా మంచిగా ఆలోచించలేరు. ఇవి కూడా.. మన బ్యాడ్ కర్మకు కారణమౌతాయి. కాబట్టి.... ముందు బ్యాడ్ ఆటిట్యూడ్ మార్చుకోవడానికి ప్రయత్నించాలి.

69

5. మన కర్మ సరిగా లేదు అనుకుంటున్నవారు ముందుగా తమ బద్దకాన్ని తగ్గించుకోవాలి. మనకు ఒంటినిండా బద్దకం ఉంటే జీవితంలో ఏదీ సాధించలేం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన బద్దకమే మనకు చెడు కర్మగా మారుతుంది అని గుర్తుంచుకోవాలి.
 

79

6.ఇక చాలా మంది ప్రతి విషయంలోనూ తమకు అర్హత లేదని భావిస్తూ ఉంటారు. మీకు మీరే మీకు అర్హత లేదు అనుకుంటే.. ఇతరులు మీలో అర్హత ఉందని గుర్తిస్తారు అనుకోవడం కూడా పొరపాటే. ఇలా మీ అర్హతను మీరే కోల్పోయి అవకాశాలను దూరం చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా చెడు కర్మగానే మారుతుంది.

89
spiritual

spiritual

7.దేని గురించైనా ఆలోచించి పని చేయడం లో తప్పులేదు. కానీ మరీ ఓవర్ థింక్ చేయడం ఎప్పుడూ మంచిది కాదు. ఓవర్ థింకింగ్ కూడా బ్యాడ్ కర్మగా మారుతుంది. మీ అంతట మీరే మీ బుర్రను పాడుచేసుకుంటారు.

99
Spirituality

Spirituality

8.ఇక సమయాన్ని వృథా చేసుకోవడం కూడా మానుకోవాలి. ఇది కూడా... మీ బ్యాడ్ కర్మ గా మారే అవకాశం ఉంది. కాబట్టి... ఎప్పుడూ సమయాన్ని వృథా చేసుకోకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Spiritual Temples: ఇండియాలో మీరు తప్పక సందర్శించాల్సిన 10 టెంపుల్స్ ఇవే
Recommended image2
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image3
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved