Sankranthi 2022: సంక్రాంతి విశిష్టత, సంక్రాంతి రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏవి దానంగా ఇవ్వాలో తెలుసా?
సంక్రాంతి (Sankranthi) అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. సంక్రాంతి పండుగను పొంగల్ (Pongal) అని కూడా అంటారు. కొత్త సంవత్సరం మొదటి నెలలో వచ్చే అతి పెద్ద పండుగగా మూడు రోజుల పాటు ఘనంగా సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకుంటాం..
కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు (Farmers) ఈ పండుగను ఆనందంగా (Happy) చేసుకుంటారు. సంప్రదాయ దుస్తులను ధరించి ఇంటి ముందర రంగు రంగుల ముగ్గులతో చూడ ముచ్చటైన పండుగ వాతావరణంతో కనులకు కనువిందు చేసే ఆనందదాయకంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను (Orange color dress) ధరిస్తే మంచి శుభ ఫలితం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటిని శుభ్రపరచుకుని, గడపకు పసుపు, కుంకుమలు పెట్టి, గుమ్మానికి తోరణాలు కట్టి, పూలతో అలంకరిస్తారు (Decorated).
పూజామందిరాన్ని చక్కగా అలంకరించి ఇంటి ముందర రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ముగ్గు మీద గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. సంక్రాంతి రోజున బంధుమిత్రులతో (Relatives) కిటకిటలాడుతూ పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఈ రోజున హరిదాసు హరినామ కీర్తనలు, బుడబుక్కల దొరలు, గంగిరెద్దుల వాళ్లు వారి వారి తీరులోని భక్తి గీతాలు పాడుతూ మనల్ని ఆశీర్వదిస్తూ (Blessing) ఇంటింటికి తిరుగుతారు.
ఈ రోజున పితృదేవతారాధన చేయడంతో వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు చెబుతున్నారు. సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్యం (Poverty), బాధలు (Suffering) తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. స్త్రీలు సంక్రాంతి రోజున పువ్వులు, పసుపు, కుంకుమ, బెల్లం, పండ్లను దానం చేస్తే సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుందని విశ్వాసం.
అలాగే సంక్రాంతి రోజున గుమ్మడి పండ్లను (Pumpkin) దానం చేస్తే శ్రీ మహా విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున పిండిపదార్థాలుగా చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా సూర్యభగవానుడికి, పితృదేవతలకు పెట్టి ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు (Happiness) ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు.
అలాగే సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి (Invited) వారికి బట్టలు పెట్టడం సంప్రదాయం (Tradition). ఇలా బంధువులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి రోజున రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్లను పెట్టి గొబ్బి పాటలు పాడుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
సంక్రాంతి రోజున ఆకలిగా (Hungry) ఉన్నా బిచ్చగాళ్లకు అన్నదానం (Annadanam) చేస్తే పుణ్య ఫలితం పొందుతారు. అలాగే ఈ పండుగ రోజున ఎవరితోనూ వాదనకు దిగరాదు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో, కొత్త అల్లుళ్ళతో, కోడిపందాలతో ఆనందంగా సరదాగా జరుపుకునే పండుగ ఇది.