Maha Shivaratri: ఈ మంత్రాలు చదివితే, చావు భయం ఉండదు
మహా శివరాత్రి కేవలం నాలుగు మంత్రాలు చదవడం వల్ల చావు భయం అనేది ఉండదు. మరి, ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందామా...

పుట్టిన ప్రతి ఒక్కరూ శివైక్యం అవ్వాల్సిందే. కానీ.. ఎప్పుడు ఎవరికి ఎలా మరణం రాసి పెట్టి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ.. ప్రతి నిమిషం చనిపోతామేమో అనే భయం కొందరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయం ఉంటే జీవితాన్ని సంతోషంగా జీవించలేం. లేదు.. ఆనందంగా జీవితం సాగాలంటే.. ఆ చావు భయం ఉండకూడదు. మరి, ఆ భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...
చావు భయాన్ని పోగొట్టే నాలుగు మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ శివుడి మంత్రాలే. శివరాత్రికి వీటిని భక్తిగా చదివితే మీ భయాలన్నీ పోతాయి, ప్రశాంతంగా ఉంటారు!
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఉంది. ఆ రోజు శివుడి నామస్మరణ చేస్తే ఆయన ఆశీస్సులు ఉంటాయి. అంతేకాదు, మీకున్న చావు భయం కూడా పోగొట్టుకోవచ్చు. ఆ మంత్రాలు ఏంటో చూడండి!
హ్రీం ఈశనాయ నమః
మహాశివరాత్రి మొదటి పూజ సమయం ఫిబ్రవరి 26 సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి 'హ్రీం ఈశనాయ నమః' మంత్రం చదవండి. కనీసం 108 సార్లు చదువుకోవడం మంచిది.
హ్రీం అఘోరాయ నమః
మహాశివరాత్రి రెండో పూజ సమయం ఫిబ్రవరి 26 రాత్రి 9:26 నుండి 12:34 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి 'హ్రీం అఘోరాయ నమః' మంత్రం చదవండి.
హ్రీం వామదేవాయ నమః
మహాశివరాత్రి మూడో పూజ సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 12:34 నుండి 3:41 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి 'హ్రీం వామదేవాయ నమః' మంత్రం చదవండి.
హ్రీం సద్యోజాతాయ నమః
మహాశివరాత్రి నాలుగో పూజ సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3:41 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 6:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి "హ్రీం సద్యోజాతాయ నమః" మంత్రం చదవండి.