Spiritual: శ్రావణమాసంలో ఎందుకు మాంసాహారం తినకూడదు.. భక్తి కోసమా.. ఆరోగ్యం కోసమా?
Spiritual : శ్రావణమాసం హిందువులకి అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చాలామంది మాంసాహారం ముట్టుకోరు. అయితే మాంసాహారం ముట్టుకోకపోవటానికి కారణం ఆరోగ్యమా.. భక్తా ఇప్పుడు చూద్దాం.
మాసాలలో కెల్లా శ్రావణమాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అలాగే ఈ నెల నుంచి అనేక పండుగలు కూడా ప్రారంభమవుతాయి. కృష్ణాష్టమి, రక్షాబంధన్, నాగ పంచమి వంటి అనేక ముఖ్యమైన హిందూ పండగలు శ్రావణమాసంలోనే వస్తాయి. కాబట్టి ఈ మాసం హిందువులకి అత్యంత ప్రీతిపాత్రమైనది.
అయితే ఈ నెలలో చాలామంది మాంసాహారం ముట్టుకోరు. దీని వెనక కారణం ఏమిటి.. ఆరోగ్యం కోసమా.. భక్తి కోసమా? అనే ప్రశ్న తలెత్తితే రెండింటి కోసం అని చెప్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ముందుగా హిందూ మతం ఏం చెప్తుందో చూద్దాం.
వర్షాకాలంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సూర్యరశ్మి లేకపోవటం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. శ్రావణమాసంలో ఉపవాసం ఉన్నవారు తేలికగా జీర్ణం అయ్యే చిరుధాన్యాలు తినటం మంచిదని పెద్దవాళ్లు చెబుతున్నారు.
కాబట్టి ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. ఇంక సైన్సు ఏం చెప్తుందో చూద్దాం. వర్షాకాలం బ్యాక్టీరియా పెరుగుదలకు మరియు విస్తరణకు అనువైన కాలం. వర్షాకాలంలో చాలా రకాల సూక్ష్మజీవులకు సంతాన ఉత్పత్తి కాలం కాబట్టి ఆహారం మరియు నీటి ద్వారా కలుషితమయ్యే ప్రమాదం పెరుగుతుంది.
అలాగే ఋతుపవనాలు యొక్క అవాస్తవిక వాతావరణం అనే సూక్ష్మజీవులను చాలా దూరం ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే సూర్యరశ్మి తక్కువగా ఉండటం కారణంగా విటమిన్ డి తక్కువగా ఉంటుంది. ఈ నెలలో రోగనిరోధక వ్యవస్థ నిరంతరం అంటువ్యాధి కారకాలకు గురవుతుంది.
కాబట్టి ఈ నెలలో మాంసాహారం తీసుకుంటే పేగు వృక్షజాలం మరియు రోగ నిరోధక వ్యవస్థ మాంసంలోని ఇన్ఫెక్షన్ తో పోరాడలేవు మరియు వేగంగా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి శ్రావణమాసంలో మాంసం తినకపోవడం అనేది అటు భక్తికి ఇటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.