MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: రావణుడి 10 తలల వెనక కారణం ఏమిటి.. పురాణం ఏం చెప్తుంది!

Spiritual: రావణుడి 10 తలల వెనక కారణం ఏమిటి.. పురాణం ఏం చెప్తుంది!

 Spiritual: రామాయణంలో రావణాసురుడికి పది తలలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
 

Navya G | Published : Oct 04 2023, 03:13 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి రామ రావణ యుద్ధానికి కారణమయ్యాడు. కానీ నిజానికి రావణుడు బ్రాహ్మణోత్తముడు, బలవంతుడు, గొప్ప తపస్సాలి. సనక సమందాది ఋషుల శాపం వలన వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులే త్రేతా యుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారని పురాణం చెప్తుంది.
 

26
Asianet Image

 అయితే రావణుడికి పది తలలు ఎందుకు ఉన్నాయి అనే దానిపై పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక పురాణ కథ ప్రకారం విష్ణుమూర్తి నరసింహ అవతారంలో తనను సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి, 20 గోళ్ళతో నన్ను ఒక్కడిని చంపటం కూడా ఒక పౌరుషమైన అంటూ హిరణ్యకశిపుడు చులకనగా మాట్లాడుతాడు.
 

36
Asianet Image

దానికి శ్రీహరి తదుపరి జన్మలో నీకు 10 తలలు 20 చేతులు ప్రసాదించి, నేను మానవుడిగా అవతరించి నిన్ను సంహరిస్తాను అని చెప్పాడంట. అందుకే శ్రీరాముడిగా పుట్టిన విష్ణుమూర్తి రావణాసురుడిగా పుట్టిన హిరణ్యకశిపుడిని మానవ అవతారంలో చంపుతాడు.
 

46
Asianet Image

మరొక కథనం ప్రకారం రావణుడికి కామరూప విద్యతో పది తలలు ఏర్పడ్డాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అతను కోరుకున్నప్పుడు పది తలలు 20 చేతులు వస్తాయి. నిజానికి రావణాసురుడు అపారమైన పరిపాలన దక్షత కలిగిన శివ భక్తుడు. కానీ స్త్రీ వ్యామోహం అతనిని అధోగతి పాలు చేసింది.
 

56
Asianet Image

 అయితే విచిత్ర రామాయణం మాత్రం మరో విధంగా చెప్తుంది. విశ్రవసు భార్య కైకసి దాంపత్య సుఖాన్ని కోరి ఆయనను చేరుకుందట. అయితే ఆమె అప్పటికే 11 సార్లు రుతుమతి అయినట్లుగా విశ్రవసు తెలుసుకుంటాడు. కాబట్టి 11 మంది పుత్రులని పొందాలని భావిస్తాడు.
 

66
Asianet Image

 కానీ కైకసి తనకి ఇద్దరు పుత్రులు మాత్రమే కావాలంటుంది. ఈ క్రమంలోనే తపోనిది అయిన విశ్రవసు తన మాట మరియు తన భార్య కైకసి మాట ఇద్దరి కాంక్ష  వృధా కాకుండా 10 తలలు ఉన్న రావణుడిని 11వ వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చాడని విచిత్ర రామాయణం కథ చెప్తుంది .

Navya G
About the Author
Navya G
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories