- Home
- Life
- Spiritual
- Shravana Masam: శ్రావణమాసంలో ఇంటికి ఇవి తీసుకువస్తే.. విజయం,ఐశ్వర్యం మీ సొంతం..!
Shravana Masam: శ్రావణమాసంలో ఇంటికి ఇవి తీసుకువస్తే.. విజయం,ఐశ్వర్యం మీ సొంతం..!
ఈ శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేసి, ఇంటికి తీసుకురావడం వల్ల.. ఆ ఇంటి కుటుంబ సభ్యులకు విజయం లభిస్తుందని నమ్ముతారు.
- FB
- TW
- Linkdin
Follow Us

శ్రావణ మాసంలో ఏం చేయాలి?
శ్రావణ మాసంలో హిందూ మతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా శివుడిని , లక్ష్మీదేవిని ఆరాధించడానికి పవిత్రమైన కాలంగా పరిగణిస్తారు. శివయ్య ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఈ నెల శ్రావణ నక్షత్రంతో ముడిపడి ఉంది. పెళ్లి కాని స్త్రీలు ఈ నెలలో ప్రత్యేక పూజలు ఆచరించడం ద్వారా మంచి భర్త వస్తారని కూడా నమ్ముతారు.ఇక వివాహిత స్త్రీలు తమ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని, భర్త ఆయుష్షు కోసం ఈ నెలలో పూజలు చేస్తారు.
ఈ శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేసి, ఇంటికి తీసుకురావడం వల్ల.. ఆ ఇంటి కుటుంబ సభ్యులకు విజయం లభిస్తుందని నమ్ముతారు. మరి, ఎలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం...
1. రుద్రాక్ష:
శ్రావణ మాసంలో వచ్చే మొదటి రోజున వెండి అమరికలో ఉన్న నిజమైన రుద్రాక్షను ధరించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ పవిత్ర ఆచారం ఒకరి జీవితంలో ఆనందం, సానుకూలతను పెంచుతుందని నమ్ముతారు. మీ ఆధ్యాత్మిక సాధనలో రుద్రాక్షను చేర్చడం ద్వారా, మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంది.
2. వెండి బ్రాస్లెట్:
శ్రావణ మాసం మొదటి రోజున వెండి బ్రాస్లెట్ కొనడం వల్ల తీర్థయాత్రలు లేదా విదేశీ ప్రయాణాలకు అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం, శివుడు తన పాదాలకు వెండి కడియం ధరిస్తాడు. ఈ ఆచారం మీ జీవితంలో సానుకూలత , శ్రేయస్సును కూడా తీసుకురాగలదు. వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
3. నీటి కుండ:
శ్రావణ మాసం మొదటి రోజున వెండి, రాగి లేదా ఇత్తడితో చేసిన నీటి కుండను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆ పాత్రను నీటితో నింపి శివునికి సమర్పించి, మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఆరాధించండి. ఇలా చేయడం వల్ల ఆ శివుని ఆశీస్సులు లభిస్తాయని కూడా నమ్ముతారు.
4. వెండి చంద్రుని బొమ్మ:
శ్రావణ మాసం మొదటి రోజున వెండి చంద్రుని బొమ్మను కొనుగోలు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల శివుని ఆవీస్సులు లభిస్తాయి. పురాణాల ప్రకారం, శివుని తలపై చంద్రుడు ఉంటాడు. వెండి చంద్రుని బొమ్మ ఇంటికి తీసుకురావడం వల్ల మీ జీవితంలో సానుకూలత, ప్రశాంతత తీసుకురాగలదు.
5. వెండి బిల్వపత్ర.. శ్రావణ మాసంలో శివుడికి వెండి బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల పాపాలు నశించి, శుభం కలుగుతుంది. శివునికి బిల్వ పత్రం సమర్పించడం వల్ల శివుని ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో సానుకూలత పెరుగుతుంది.