MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వచ్చే వారంలో పంచగ్రహకూటమి.. ఈ రాశుల వారికి అన్నీ శుభ ఫలితాలే..

వచ్చే వారంలో పంచగ్రహకూటమి.. ఈ రాశుల వారికి అన్నీ శుభ ఫలితాలే..

ఐదు రాశులు కలవడాన్ని జ్యోతిశాస్త్రంలో పంచగ్రహ యోగం అంటారు.  అరుదుగా జరిగే ఈ యోగం ఏప్రిల్ 25న మీనరాశిలో సంభవిస్తోంది. మీనరాశి ఇప్పటికే శని, శుక్రుడు, సూర్యుడు, రాహువుతో కలిసి ఉన్నాయి. వీటికి చంద్రుడు కూాడా తోడవడంతో పంచగ్రహ యోగం మొదలు కానుంది. దీని ప్రభావం కేవలం మీనరాశిపైన మాత్రమే కాదు.. అన్ని రాశులపైన ఉండనుంది. ఇందులో సింహ, కర్కాటక, వృషభ రాశుల వారికి అత్యధిక లాభాలు కలుగనున్నాయి. మిగతా రాశుల విషయానికొస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

2 Min read
Author : Anuradha B
Published : Apr 19 2025, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
వృషభ

వృషభ

చంద్రుడు శుక్రుడితో కలవడం వల్ల ఈ రాశి వారికి అదృష్ట యోగం కలగనుంది. ఏప్రిల్ 25 నుంచి వీరు తలపెట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పరిష్కారం కాకుండా ఉన్న పనులు జరుగుతాయి. ప్రేమలో పడటం, పెళ్లి ప్రయత్నాల్లో ముందుకెళ్లడం జరుగుతాయి. ఉద్యోగులకు ఇది అనువైన కాలం. ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు కలల కొలువు దొరుకుతుంది. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
మిథున

మిథున

ఈ రాశి వారికి స్వల్ప మేలు జరుగుతుంది. చంద్రుడు, శుక్రుడితో కలవడం శుభ పరిణామాలకు సంకేతం. అదే విధంగా రాహువు కూడా కలిసి ఉండటం ఈ రాశు వారికి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. బుధుడు ఆర్థిక ప్రయోజనాలకు సహకరిస్తుంటే, రాహువు జీవితంలో చికాకులు తెచ్చి పెడుతుంటాడు. ఆర్థిక లబ్ది చేతికి అందినట్టే అంది చేజారిపోతుంటుంది. పని భారం ఎక్కువ అవుతుంది. ఊహించని ఖర్చులు ఎదరుర్కోవాల్సి వస్తుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

312
సింహ

సింహ

బుధుడి అనుగ్రహంతో ఈ రాశి వారికి మేలు ఫలితాలు చేకూరతాయి. కెరీర్లో పదోన్నతులు లభిస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు భారీ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రేమ, పెళ్లి విషయాల్లో అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి అన్నీ అనుకుంటున్నట్టే జరుగుతాయి. 

412
కుంభ

కుంభ

ఈ రాశివారికి భవిష్యత్తు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి.  ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు సద్దుమణుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి.

512
తులా

తులా

పంచగ్రహ కూటమి ఈ రాశిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  వ్యాపారస్తులకు కలిసి రాదు. కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది. ప్రేమ, పెళ్లి విషయాల్లో నిరాశే ఎదురవుతుంది. వీళ్లు సుందరకాండ పారాయణం చేయాలి.

612
మేషం

మేషం

వీళ్లకి మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. చేపట్టిన పనులు ఎంతో చికాకు కలిగించి చివర్లో విజయవంతం అవుతాయి. స్థలాలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విహార యాత్రలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఆర్థిక వ్యయం అయ్యే పెట్టుబడులు వాయిదా వేయాలి. 

712
వృశ్చిక

వృశ్చిక

చంద్రుడు బుధుడితో కలవడం వల్ల ఈ రాశివారికి సానుకూల ఫలితాలుంటాయి. జీవితంలో కొత్త అధ్యాయానికి తెర తీసే మేలిమి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి. వ్యాపారస్థులు అత్యధిక లాభాలు గడిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. అయితే కొన్ని ఆరోగ్య ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

812
సింహ

సింహ

ఈ రాశి వారికి చంద్రుని అనుగ్రహం పుష్కలంగా దొరుకుతుంది.  ఉద్యోగం, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.  కోరుకున్న ఉద్యోగం దక్కుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రేమించినవారు సానుకూలంగా స్పందిస్తారు. అన్నిరకాలుగా వీళ్లకు అంతా మంచే జరిగే సూచనలున్నాయి.

912
ధనుస్సు

ధనుస్సు

వీళ్లకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. కుటుంబ వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అందులో మూడో వ్యక్తి ప్రమేయం తీసుకురావద్దు. వ్యాపారస్థులకు కలిసి రాదు. కొత్త నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగులకు కొంత సానుకూలంగా ఉంటుంది.

1012
మీనం

మీనం

మీనరాశి వారికి ఇది అన్నిరకాలుగా అనువైన సమయం. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ బాంధవ్యాలు బాగుంటాయి. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు దక్కి, కీలక స్థానాల్లోకి వెళ్తారు. ప్రేమ, పెళ్లిలకు సానుకూల సమయం.

1112
కర్కాటక

కర్కాటక

పంచగ్రహ కూటమి అత్యధిక లాభాలు అందుకునేవాళ్లలో ఈ రాశి వారు ఒకరు. జీవితాన్ని మార్చేసే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం హాయిగా ఉంటుంది.  కొత్త ప్రాజెక్టులు చేతికందుతాయి. 

1212
కన్యా

కన్యా

చంద్రుని సంచారం వల్ల ఈ రాశివారికి దండిగా లబ్ది చేకూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగులుగా  మారతారు. ప్రేమలు సఫలం అవుతాయి.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Live
SASA
(7.4 ov) 329 & 32/2
AUSAUS
429
Day 3 - Session 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Inspiring Story: కలియుగంలోనూ ఇలాంటి కొడుకులున్నారా? తల్లి కోసం చెప్పుల్లేకుండా జ్యోతిర్లింగాల యాత్ర!
Recommended image2
Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?
Recommended image3
Bonedi Barir Durga Puja: వందల ఏళ్లుగా మారని ఆచారం..ఇప్పటికీ సంప్రదాయాన్ని పాటిస్తున్న బెంగాల్ ప్రజలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved