Secret sharing: ఈ ముగ్గురితో మాత్రం సీక్రెట్స్ చెప్పకూడదు
సీక్రెట్ అంటేనే ఎవరితోనూ పంచుకోకూడనిది అని అర్థం. కానీ మనం చాలా మందికి షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే, మీ ఇంటి సీక్రెట్స్ ని పొరపాటున కూడా ముగ్గురితో పంచుకోకూడదట. , మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందామా...

ప్రతి ఒక్కరి ఇంట్లో సీక్రెట్స్ ఉండటం చాలా కామన్. ఆ రహస్యాలను చాలా మంది వేరే వారితో పంచుకుంటూ ఉంటారు. మన బంధువులే కదా.. మన ఫ్రెండ్సే కదా చెప్పేస్తూ ఉంటారు. ఇది చాలా సహజంగా అందరి ఇళ్లల్లో జరిగేదే. కానీ.. కొన్ని విషయాలను ముఖ్యంగా ఇంట్లో విషయాలను ముగ్గురు వ్యక్తులతో పొరపాటున కూడా చెప్పకూడదట. మరి, ఎవరితో చెప్పకూడదో తెలుసుకుందాం...
మన ఇంట్లో జరిగే విషయాలు, మీ రహస్యాలు అందరితో పంచుకోవడం మంచిది కాదు. నమ్మకమైన వ్యక్తులు అనుకోవచ్చు. కానీ ఎంత నమ్మకమైన వ్యక్తులైనా కొన్నిసార్లు మీకు వ్యతిరేకంగా తిరగవచ్చు. ముఖ్యంగా ముగ్గురితో రహస్యాలు చెప్పుకోవద్దు.
ఎందుకంటే వాళ్ళు మోసం చేయవచ్చు. దీనివల్ల మీ ఇంటి పరిస్థితి అందరికీ తెలుస్తుంది. దీనివల్ల మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇంటి విషయాలు ఎవరికి చెప్పకూడదో ఇప్పుడు చూద్దాం.
ఇంటి విషయాలు ఎవరితో చెప్పుకోకూడదు?
ఇంటి పనిమనిషి లేదా ఇంటి సిబ్బంది
ఇంటి పనిమనిషి ఒక ఇంట్లోనే కాదు, రెండు మూడు ఇళ్ళలో పని చేస్తారు. మీ ఇంటి ప్రైవసీ విషయాలు ఇంటి పనిమనిషి లేదా ఇంటి సిబ్బందితో చెప్పుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మీ ఇంట్లో పని చేస్తారు. కానీ మీ వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళకి తెలుసుకోవాలనే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు మీ ఇంట్లో పని వదిలి వేరే ఇంట్లో పని చేస్తారు. వాళ్ళు మీ రహస్యాలు ఇతరులతో చెప్పవచ్చు. ఇది మీ ఇంటికి మంచిది కాదు.
స్నేహితులు
స్నేహితులతో కూడా మీ ఇంటి ప్రైవసీ విషయాలు పంచుకోకూడదు. వాళ్ళు మీ స్నేహితులు కావచ్చు. కానీ మీ ఇంటి వాళ్ళు కాదు. అందుకే వాళ్ళకి మీ ఇంటి గురించి అన్నీ తెలియాలనే అవసరం లేదు. ఎందుకంటే ఇంటి ప్రైవసీ మీ బలం. మీ బలాన్ని ఇతరులతో పంచుకుంటే మీరు బలహీనులవుతారు.
పొరుగువారితో
మీ ఇంటి ప్రైవసీ విషయాలు పొరుగువారితో పంచుకోవద్దు. ఎందుకంటే పొరుగువారితో గొడవలు, భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో వాళ్ళు మీ ఇంటి రహస్యాలు ఇతరుల ముందు చెప్పేస్తారు. దీనివల్ల మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే మీ ఇంటి గోప్యతను కాపాడుకోవడానికి మీ లేదా మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితం గురించి పొరుగువారితో పంచుకోవద్దు.