- Home
- Life
- Spiritual
- Navaratri 2025: ఈ మంత్రాలు జపిస్తే... దసరా నవరాత్రుల్లో దుర్గాదేవి కటాక్షం లభించడం పక్కా..!
Navaratri 2025: ఈ మంత్రాలు జపిస్తే... దసరా నవరాత్రుల్లో దుర్గాదేవి కటాక్షం లభించడం పక్కా..!
Navaratri: శాస్త్రాల ప్రకారం, నవరాత్రి తొమ్మిది రోజులలో ప్రతిరోజూ తొమ్మిది రూపాల దుర్గామాత బీజ మంత్రాలను జపించడం వల్ల దుర్గా దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి.

Navaratri 2025
దసరా నవరాత్రులు దగ్గరపడుతన్నాయి. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం.. భక్తులు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తారు. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజించుకుంటాం. అయితే.. ఈ నవరాత్రుల్లో కొన్ని రకాల మంత్రాలను జపిస్తూ.. అమ్మవారిని పూజిస్తే.. ఆ దుర్గామాత కటాక్షం లభిస్తుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. మరి... ఆ మంత్రాలు ఏంటో చూద్దామా....
దుర్గాదేవి మంత్రాలు..
శాస్త్రాల ప్రకారం, నవరాత్రి తొమ్మిది రోజులలో ప్రతిరోజూ తొమ్మిది రూపాల దుర్గామాత బీజ మంత్రాలను జపించడం వల్ల దుర్గా దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి.
నవరాత్రి తొమ్మిది రోజులలో ప్రతిరోజూ జపించాల్సిన మంత్రాలు....
మాత శైలపుత్రి బీజ మంత్రం : ఓం శం శైలపుత్రీ దేవ్యే నమ:
మాత బ్రహ్మచారిణి బీజ మంత్రం : హ్రీం శ్రీ అంబికాయే నమ:
మాత చంద్ర ఘంట బీజ మంత్రం .. ఐన్ శ్రీం శక్షయే నమ:
మాత కూష్మాండ బీజ మంత్రం.. ఐం హ్రీ దేవ్యే నమ:
మాత స్కందమాత బీజ మంత్రం.. హ్రీం క్లీం స్వామిన్యే నమ:
మాత కాత్యాయనీ బీజ మంత్రం...క్లీం శ్రీ త్రినేత్రాయే నమ:
మాత కాలరాత్రి బీజ మంత్రం.. క్లీం ఐం శ్రీ కాళికాయే నమ:
మాత మహాగౌరీ బీజ మంత్రం.. శ్రీం క్లీం హ్రీం వరదాయే నమ:
మాత సిద్ధిదాత్రి బీజ మంత్రం... హ్రీం క్లీం ఐం సిద్ధయే నమ:
ఇతర మంత్రాలు...
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేన్ సంస్థిత, నమస్తేస్యయే నమస్తే నమస్తే నమస్తే నమో నమః
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.
ఓం జయంతీ మంగళ కాళీ భద్రకాలీ కపాలీనీ. దుర్గా క్షమా శివ ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే ।
క్రమం తప్పకుండా ఈ మంత్రాలు జపిస్తే.. ఆ దుర్గా మాత ఆశీస్సులు లభిస్తాయి.