బెంగళూరులో తప్పక సందర్శించవలసిన ప్రసిద్ధి చెందిన శివుని ఆలయాలు ఏవో తెలుసా?
పరమపవిత్రమైన ఆ భోలాశంకరుడిన్ని దర్శించిన సకల పాపములు తొలగిపోయి పునీతులం అవుతాము. అయితే బెంగళూరులో శివాలయాలు అనేకం ఉన్నాయి. ఈ ఆలయాలను సందర్శించడానికి భక్తులు శివరాత్రి సందర్భంగా అనేక వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ పురాతనమైన చారిత్రాత్మక కట్టడాలను కలిగిన దేవాలయాలు, శిల్పకళలు (Sculptures) పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ దేవాలయాలను దర్శించిన పర్యాటకులకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా బెంగళూరులో తప్పక సందర్శించవలసిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం.
అయితే బెంగళూరులో తప్పక సందర్శించవలసిన దేవాలయాల జాబితాల్లో గవి గంగాధారేశ్వర ఆలయం, కాడు మల్లేశ్వర ఆలయం, కెంఫోర్ట్ శివాలయం, ద్వాదాష జ్యోతిర్లింగ ఆలయం, కాడు మల్లేశ్వర ఆలయం ఇలా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను సందర్శించిన ఆ పరమ శివుని అనుగ్రహం (Grace) మనమీద ఎల్లవేళలా ఉంటుంది. ఈ దేవాలయాలు ఒకొక్క ప్రత్యేకమైన విశిష్టతను (Uniqueness) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ దేవాలయాలను బెంగళూరు వెళ్ళినప్పుడు పర్యాటకులు తప్పక సందర్శించవలసిన దేవాలయాలు. అయితే వాటిలో కొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం.
1.కాడు మల్లేశ్వర ఆలయం: ఇది 17వ శతాబ్దపు కాలంలో శివునికి అంకితం చేస్తూ నిర్మించబడిన ఆలయం. మల్లేశ్వరం ప్రాంతానికి కాడు మల్లేశ్వర ఆలయం (Kadu Malleshwara Temple) నుండి పేరు వచ్చింది. ఇక్కడి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నందీశ్వర తీర్థం (Nandeeshwara Theertham) ఉంది. ఈ ఆలయ విశిష్టత ఏమి అంటే నంది విగ్రహం నోటినుండి నిరంతరం నీరు ప్రవహిస్తూ శివలింగంపై అభిషేకం చేస్తున్నట్టు పడుతుంది. ఈ అందమైన దృశ్యాన్ని తిలకించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
2.కోట జలకాంతేశ్వర ఆలయం: ఈ ఆలయం చోళ రాజ వంశానికి (Chola dynasty) చెందినది. ఈ ఆలయం బెంగుళూరులోని అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉన్నాయి. అవి జలకాంతేశ్వర, పార్వతి, కైలాసానంతర్. కోట జలకాంతేశ్వర ఆలయం (Kota Jalakanteshwara Temple) కలాసిపాల్య బస్ స్టాండ్ సమీపంలో ఉంది. బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి.
3. గవి గంగాధారేశ్వర ఆలయం: గవి గంగాధారేశ్వర ఆలయం (Gavi Gangadhareshwara Temple) గవిపురంలోని అతి పురాతనమైన గుహ ఆలయం. ఈ ఆలయంలో మకర సంక్రాంతి పండగ సాయంత్రం సూర్యరశ్మి నంది విగ్రహం కొమ్ముల మధ్య నుండి వెళుతూ నేరుగా శివలింగం మీద పడుతుంది. ఈ దృశ్యం మకర సంక్రాంతి పండుగ రోజున మాత్రమే జరుగుతుంది. ఆ రోజున ఈ అందమైన దృశ్యాన్ని (Scenery) తిలకించడానికి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తుంటారు.
4. కెంఫోర్ట్ శివాలయం: బెంగళూరుకి ప్రధాన ఆకర్షణగా కెంఫోర్ట్ శివాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా 65 అడుగుల శివుని విగ్రహం (Statue of Lord Shiva) ఉంది. ఈ ఆలయంలో మరొక ప్రధాన ఆకర్షణగా గణేశ విగ్రహం (Ganesha statue), ఇతర రకాల శివుని నమూనాలను మనం చూడవచ్చు. ఈ ఆలయం బెంగళూరు లోని ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్ లో ఉంది. ఇది తప్పక సందర్శించవలసిన దేవాలయం.
5. ద్వాదాష జ్యోతిర్లింగ ఆలయం: శ్రీ ద్వాదాష జ్యోతిర్లింగ ఆలయంలో (Sri Dwadasha Jyotirlinga Temple) ప్రధాన ఆకర్షణగా 12 చిన్న శివాలయాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోని ఇతర జ్యోతిర్లింగ ఆలయాలను పోలిఉంటాయి. ఈ ఆలయం బెంగుళూరులోని శ్రీనివాసపురంలోని (Srinivasapuram) ఓంకార్ హిల్స్ వద్ద ఉంది. ఈ ఆలయ సందర్శన మనకు మధురమైన జ్ఞాపకాన్ని మిగులుస్తుంది.