MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మోక్షద ఏకాదశి 2023: ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

మోక్షద ఏకాదశి 2023: ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

mokshada ekadashi 2023: మోక్షద ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం మనపై ఉంటుందని నమ్ముతారు. అయితే ఈరోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 22 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

mokshada ekadashi 2023: సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి ఉన్నాయి. అలాగే మోక్షద ఏకాదశి సంవత్సరంలో చివరి ఏకాదశి. మోక్షద ఏకాదశిని మార్గశిర్ష మాసంలోని శుక్లపక్షంలో మోక్షద ఏకాదశి లేదా ఏకాదశి తిథి అని కూడా పిలుస్తారు. సనాతన పంచాంగం ప్రకారం.. ఈసారి మోక్షద ఏకాదశి డిసెంబర్ 22 అంటే ఈ రోజే వచ్చింది. ఈ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఈ భగవంతుడిని పూజించడం వల్ల పుణ్యఫలాలు దక్కుతాయని నమ్ముతారు. అలాగే చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మోక్షద ఏకాదశి రోజున చేయవల్సిన, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
lord vishnu 001

lord vishnu 001

మోక్షద ఏకాదశి రోజున ఏం చేయాలి?

ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజించాలి.

తులసి  మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి.

పేదవారికి దానం చేయాలి.

వీటితో పాటు భజనలు, కీర్తనలు చేయాలి.

ఉపవాస సమయంలో రోజంతా ఏమీ తినకూడదు. మరీ మీకు చేతకాకపోతే పండ్లను తినొచ్చు.
 

34


మోక్షద ఏకాదశి రోజున ఏం చేయకూడదు?

ఏకాదశి నాడు అన్నం తినకూడదు.

ఈ రోజు హెయిర్ కట్ చేయించుకోవడం అశుభంగా భావిస్తారు.

ఉపవాసం ఉన్నవారు ఉదయం పొద్దుపోయే వరకు నిద్రపోకూడదు.

ఈ రోజున దొంగతనం, హింస, కోపానికి దూరంగా ఉండాలి.

అలాగే తులసి ఆకులు, పువ్వులను కోయకూడదు. 

44

మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత

మోక్షద ఏకాదశి ఉపవాసం ఉండి లోకానికి అధిపతి అయిన విష్ణుమూర్తిని పూజించడం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం.. శ్రీకృష్ణుడు మోక్షద ఏకాదశి రోజున అర్జునుడికి గీతను బోధించాడు. అందుకే ఈ రోజున గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గీత పారాయణం లేదా వినడం శుభ ఫలితాలను ఇస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Spiritual Temples: ఇండియాలో మీరు తప్పక సందర్శించాల్సిన 10 టెంపుల్స్ ఇవే
Recommended image2
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image3
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved