MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మకర సంక్రాంతి నాడు శివుడికి ఇలా అభిషేకం చేస్తే మీకోసం అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి

మకర సంక్రాంతి నాడు శివుడికి ఇలా అభిషేకం చేస్తే మీకోసం అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి

Makar Sankranti 2024: మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు ఉత్తరాయణుడు అవుతాడని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఇది దేవతలకు పగటి సమయం. ఈ సమయంలో కాంతి పెరుగుతుంది. మకర సంక్రాంతి రోజున తలస్నానం చేయడం, ధ్యానం చేయడం, పూజించడం వల్ల తిరుగులేని ఫలితాలు కలుగుతాయని మత విశ్వాసం. అలాగే మన కోరికలన్నీ నెరవేరుతాయని కూడా నమ్ముతారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 10 2024, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మకర సంక్రాంతి పండుగను ప్రతి ఏడాది మనం మకర రాశిలో సూర్యుడు సంచరించే రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే 2024లో మకర సంక్రాంతిని జనవరి 15న జరుపుకోబోతున్నాం. ఈ రోజున గంగానదిలో స్నానమాచరించి దేవుడిని పూజించడం, జపం చేయడం, దానం చేయాలనే నియమం ఉంది. మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు ఉత్తరాయణుడవుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. మకర సంక్రాంతి నాడు శివుడిని పూజిస్తే పితృ దోషం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
 

24

అలాగే  ఈ రోజు పూజ చేయడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. మీరు కూడా పితృ దోషం నుంచి విముక్తి పొందాలనుకుంటే మకర సంక్రాంతి నాడు తలస్నానం చేసి ధ్యానం  చేయండి. ఆ తర్వాత శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది. ఇంతకీ శివుడికి ఎలా అభిషేకం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

34

అభిషేక సమయం

మకర సంక్రాంతి నాడు అరుదైన శివ వాసి యోగం ఏర్పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజున పరమేశ్వరుడు మధ్యాహ్నం 02.16 గంటల వరకు కైలాస దీక్షలో కూర్చుంటారు. శివుడు కైలాసంపై కూర్చున్నప్పుడు అభిషేకం చేయడం చేస్తే మీరు అన్ని రకాల సుఖసంతోషాలు పొందుతాడని శివ పురాణంలో చెప్పబడింది. అదే సమయంలో బాధలన్నీ తొలగిపోతాయి. అందుకే ఈ సమయం వరకు మీరు శివుడికి అభిషేకం చేయొచ్చు.
 

44

అభిషేకం ఎలా చేయాలి?

మీరు మీ జీవితంలో దుఃఖం, బాధల నుంచి నుండి విముక్తి పొందాలనుకుంటే మకర సంక్రాంతి నాడు గంగా నీరు కలిపిన నీటితో స్నానం చేయండి. అందుబాటులో ఉంటే గంగా, గోదావరి, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయండి. ఆ తర్వాత తెల్లని దుస్తులు ధరించి ఆవు పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యితో శివుడికి అభిషేకం చేయండి. ఈ సమయంలో నల్ల నువ్వులు, పువ్వులు, బెల్విపత్రం వంటి వస్తువులను శివుడికి సమర్పించండి. పూజ సమయంలో శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shivratri: మహా శివరాత్రి రోజున శివయ్య పూజలో వీటిని మాత్రం వాడకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image2
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Recommended image3
Black Beads: ఒక స్త్రీ నల్ల పూసల దండను.. మరో స్త్రీ వేసుకోవచ్చా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved